Site icon NTV Telugu

MLC Kavitha: రేపు కవిత మధ్యంతర బెయిల్పై తీర్పు..

Kavitha

Kavitha

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇవ్వనుంది. రేపు ఉదయం 10:30 గంటలకు రౌస్ అవెన్యూ కోర్ట్ జడ్జి కావేరి బవెజా తీర్పు ఇవ్వనున్నారు. కాగా.. తన చిన్న కొడుకు పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత కోర్టును ఆశ్రయించింది. గత గురువారం నాడు కోర్టులో వాదనలు ముగిశాయి. కవిత మధ్యంతర బెయిల్ పై స్పెషల్ కోర్ట్ తీర్పు రిజర్వ్ చేసింది.

Read Also: Matchbox: అగ్గిపెట్టె కోసం గొడవ.. యువకుడి దారుణహత్య..

కాగా.. కవితకు లిక్కర్ కేసులో బెయిల్ ఇవ్వద్దని ఈడీ కోర్టు ముందు వాదనలు వినిపించింది. కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని ఈడీ పేర్కొంది. లిక్కర్ కేసులో కవిత కీలకంగా ఉన్నారని.. డిజిటల్ ఆధారాలను కవిత ధ్వంసం చేసిందని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి హవాలా రూపంలో రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చారని.. ఇండో స్పిరిట్ లో అరుణ్ పిళ్ళై ద్వారా కవిత 33 శాతం వాటా పొందిందని ఈడీ న్యాయస్థానానికి తెలిపింది.

Read Also: Pawan Kalyan: అనకాపల్లి వారాహి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

కవిత తనకు సంబంధించి ఎటువంటి వివరాలు ఈడీకి చెప్పొద్దని కేసులో అప్రూవర్ గా మారిన వ్యక్తిని బెదిరించారని, ఇలాంటి సమయంలో కవితకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ అభిప్రాయపడింది. దీంతో ఇరుపక్షాల వాదన విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కాగా.. రేపు మధ్యంతర బెయిల్ పై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.

Exit mobile version