Site icon NTV Telugu

JrNTR : ఎన్టీఆర్ డెడికేషన్.. 7 వారాల్లో 10 కిలోల బరువు తగ్గిన యంగ్ టైగర్!

Ntrneel

Ntrneel

టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ తన నటనతోనే కాకుండా పాత్ర కోసం తను పడే కష్టంతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు. గతంలో ‘రాఖీ’ సినిమా కోసం బొద్దుగా కనిపించిన తారక్, ‘యమదొంగ’ సమయానికి స్లిమ్‌గా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు అదే అంకితభావంతో తన 31వ చిత్రం NTRNeel కోసం మరోసారి స్టన్నింగ్ ట్రాన్స్‌ఫార్మేషన్‌తో సిద్ధమవుతున్నారు.

 Also Read : NBK 112 : బాలయ్య – వివేక్ ఆత్రేయ సినిమా కోసం ఇద్దరు టాప్ టెక్నిషియన్స్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా కోసం తారక్ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు. కేవలం 7 వారాల వ్యవధిలోనే 10 కిలోల బరువుతగ్గాడట ఎన్టీఆర్. దీని కోసం ఆయన అత్యంత కఠినమైన క్రమశిక్షణను పాటిస్తున్నారు. ప్రతిరోజూ 90 నిమిషాల పాటు ఫంక్షనల్ ట్రైనింగ్ చేయడంతో పాటు తన ఫిట్‌నెస్ ట్రైనర్ సూచనల మేరకు  ఖచ్చితమైన డైట్ ఫాలో అవుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో తారక్ మేకోవర్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో టొవినో థామస్, కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ మరియు బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ నీల్ మార్కు ఇంటెన్సిటీకి ఎన్టీఆర్ పవర్ యాడైతే థియేటర్లలో పూనకాలేనని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఈ సినిమాకు సంబందించిన గ్లిమ్స్ రిలీజ్ చేసే లోహ్చనలో ఉన్నారు మేకర్స్.

Exit mobile version