Site icon NTV Telugu

Jr NTR-Champion : నీ వెనుక నేనుంటా.. రోషన్ ‘ఛాంపియన్’కు తారక్ గ్రాండ్ సపోర్ట్..

Roshan. Champion,jr Ntr

Roshan. Champion,jr Ntr

టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేకా, అనస్వర రాజన్ జంటగా నటించిన ‘ఛాంపియన్’ సినిమా డిసెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ ఆల్రెడీ పీక్స్‌లో ఉండగా, తాజాగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ సినిమాపై తారక్ తన ప్రేమను కురిపించారు. “స్టూడెంట్ నంబర్ 1 నుంచి ఛాంపియన్ వరకు.. స్వప్న సినిమా కొత్త గొంతుకలను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంది. వాళ్ళు చేసే ప్రతి సినిమా వెనుక సినిమాపై ఉన్న అమితమైన ప్రేమ కనిపిస్తుంది” అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. అంతే కాదు..

Also Read : Prabhas : కొత్త డైరెక్టర్లకు ప్రభాస్ బంపర్ ఆఫర్..

స్వప్న దత్ తనకు ఎప్పుడూ అండగా ఉంటుందని, తను కూడా ఎప్పుడూ స్వప్న టీమ్‌కు సపోర్ట్‌గా ఉంటానని తారక్ పేర్కొన్నారు. హీరో రోషన్, అనస్వర, డైరెక్టర్ ప్రదీప్ అద్వైతంకు ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు. 2025 ఏండ్‌లో ఈ సినిమా ఒక మెమరబుల్ హిట్ అవ్వాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. స్వయంగా తారక్ రంగంలోకి దిగి సపోర్ట్ చేయడంతో ‘ఛాంపియన్’ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రామిసింగ్‌గా ఉన్నాయి. మరి క్రిస్మస్ కానుకగా వస్తున్న ఈ ‘ఛాంపియన్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి!

 

Exit mobile version