Dandora: టాలీవుడ్లో వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ‘దండోరా’ (#Dhandoraa) చిత్రం ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది, తాజాగా ఈ సినిమాను వీక్షించిన గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, చిత్ర యూనిట్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదికగా సినిమా గురించి గొప్పగా స్పందించారు. సినిమా చూసిన తర్వాత తన అనుభూతిని పంచుకుంటూ.. “దండోరా సినిమా నన్ను ఎంతగానో ఆలోచింపజేసింది. ఇది చాలా పవర్ఫుల్ మూవీ” అని తారక్ పేర్కొన్నారు. చిత్రంలోని నటీనటుల ప్రతిభను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ శివాజీ గారు, నవదీప్, నందు, రవికృష్ణ మరియు బిందు మాధవి సినిమా అంతటా అద్భుతమైన నటనను కనబరిచారని కొనియాడారు. ప్రతి పాత్రలోనూ లోతైన భావోద్వేగాలు ఉన్నాయని, నటీనటులు తమ పెర్ఫార్మెన్స్తో ప్రాణం పోశారని అభిప్రాయపడ్డారు.
READ ALSO: VK Naresh: నా సినిమాకి నాకే టికెట్లు దొరకడం లేదు.. నరేష్ ఆసక్తికర కామెంట్స్!
కేవలం నటనపైనే కాకుండా, సాంకేతిక విభాగం మరియు కథా బలంపై కూడా ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిత్రానికి మూలస్తంభం లాంటి బలమైన కథను అందించిన దర్శకుడు మురళీ కాంత్ గారికి ‘హాట్సాఫ్’ చెప్పారు. ఒక నేటివిటీ ఉన్న రూటేడ్ స్టోరీని తెరపైకి తీసుకురావడంలో ఆయన చూపిన ప్రతిభను అభినందించారు. ఇలాంటి వినూత్న ప్రయత్నాన్ని నమ్మి, వెన్నుతట్టి ప్రోత్సహించిన నిర్మాత రవీంద్ర బెనర్జీ గారిని కూడా తారక్ ప్రత్యేకంగా అభినందించారు. ఇంతటి అద్భుతమైన చిత్రంలో భాగమైన ప్రతి ఒక్క సాంకేతిక నిపుణుడికి, నటీనటులకు ఎన్టీఆర్ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక చిన్న చిత్రంగా వచ్చి, ఇంతటి కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించడం గొప్ప విషయమని ఆయన చెప్పుకొచ్చారు.
READ ALSO: Silver Investment: 30 రోజుల్లో లక్ష పెరిగిన వెండి ధర.. రీజన్స్ ఇవే!