NTR Fan: ప్లీజ్ డాక్టర్స్.. ‘దేవర’ చూసేవరకైనా నన్ను బతికించండి: ఎన్టీఆర్ అభిమాని
- సెప్టెంబర్ 27న దేవర రిలీజ్
- చావుబతుకుల మధ్య ఎన్టీఆర్ వీరాభిమాని
- దేవరను చూడడమే చివరి కోరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR Fan Kaushik’s last wish was to see the Devara: ‘ప్లీజ్ సర్.. దేవర చిత్రం చూసేవరకైనా నన్ను బతికించండి’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు డాక్టర్లను కోరుతున్నాడు. గత కొంతకాలంగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఏపీకి చెందిన కౌశిక్ (19) అనే యువకుడు.. చనిపోయేలోపు ఎన్టీఆర్ తాజాగా నటించిన దేవర సినిమాను చూడాలనుకుంటున్నాడు. దేవర చిత్రంను చూడడమే కౌశిక్ చివరి కోరిక. ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ ఫాన్స్, నెటిజెన్స్.. అతడి కోరిక నెరవేరావాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.
ఎన్టీఆర్ అంటే కౌశిక్‌కు చిన్నప్పటినుంచి పిచ్చి అని అతని తల్లిదండ్రులు తెలిపారు. ‘చిన్నప్పటినుంచి ఎన్టీఆర్ అంటే కౌశిక్‌కు చాలా ఇష్టం. నా కొడుకు బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఇప్పుడు ఆస్పత్రిలో ఉన్నాడు. అయినా కూడా దేవర సినిమా చూడాలనుకుంటున్నాడు. సెప్టెంబర్ 27 వరకు తనను బతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడు. దేవర చూడడమే కౌశిక్ ఆఖరి కోరిక’ అని ఆయన తల్లి మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు.
Also Read
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
- Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?
- AP Government Employees Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వరుసగా 4 రోజుల సెలవులు.. ఉత్తర్వులు జారీ
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
Also Read: Gold Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో నేటి రేట్స్ ఇవే!
తన కుమారుడి వైద్యానికి రూ.60 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారని కౌశిక్ తల్లి తెలిపారు. ప్రభుత్వం, దాతలు తమకు సాయం చేయాలని కోరారు. ఇందుకు సంబధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను ఎన్టీఆర్ అభిమానులు షేర్ చేసి.. ఆయన్ని ట్యాగ్ చేస్తున్నారు. ఈ విషయం ఎన్టీఆర్ వరకు చేరితే.. తప్పకుండా సాయం చేస్తారని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దేవర సినిమా చూడడమే కాదు.. బోన్ క్యాన్సర్‌ను కూడా కౌశిక్ జయించాలని అందరం కోరుకుందాం. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న దేవర సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
-
OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
-
Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
-
Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?
-
Rashmika Mandanna: ‘రణబాలి’ అసలు కథేంటో చెప్పిన రష్మిక మందన్న!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!