JP Nadda: నిపా, కోవిడ్-19 వ్యాధులు మానవేతర మూలాల నుండి ఉద్భవించాయి..
- నిపా వైరస్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి
- నిపా.. కోవిడ్-19 వంటి అంటువ్యాధులు మానవేతర మూలాల నుండి ఉద్భవించాయి- నడ్డా
- జంతువులతో పరిచయం ఏర్పడిన తర్వాత ఈ వ్యాధులు మానవులలో వ్యాపించాయి- జేపీ నడ్డా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిపా వైరస్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో వెల్లడించారు. నిపా, కోవిడ్-19 వంటి అంటువ్యాధులు మానవేతర మూలాల నుండి ఉద్భవించాయని ఆయన అన్నారు. జంతువులతో పరిచయం ఏర్పడిన తర్వాత ఈ వ్యాధులు మానవులలో వ్యాపించాయని చెప్పారు. అటువంటి ఉద్భవిస్తున్న వ్యాధులను ఎదుర్కోవటానికి.. మానవ, జంతువు.. పర్యావరణ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి ఉద్ఘాటించారు.
Read Also: Stock Markets: లాభాలతో ముగిసిన సూచీలు..
Also Read
- 2027 World Cup: : పంత్, శాంసన్‌లకు నో ఛాన్స్.. అశ్విన్ ప్రకటించిన జట్టులో ఊహించని ట్విస్ట్..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
‘గత కొన్ని దశాబ్దాలుగా.. జంతువులతో సంపర్కం నుండి అనేక అంటువ్యాధుల ఉద్భవించాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నివేదించిందని నడ్డా తెలిపారు. దీంతో ఆరోగ్య రంగంలో ఇటువంటి అత్యవసర పరిస్థితులు వచ్చాయని.. ఇది ప్రపంచ స్థాయిలో ఆందోళన కలిగించిందని చెప్పారు. 2011లో బంగ్లాదేశ్, భారత్‌లో నిపా వైరస్ వ్యాపించిందని అన్నారు. అంతే కాకుండా.. హాంకాంగ్‌లో 2002-03లో SARS (SARS), 2005లో H5N1, 2009లో H1N1, 2012లో MERS (MERS), 2014లో Zika వైరస్.. 2019లో COVID-19 వ్యాపించిందని జేపీ నడ్డా పేర్కొన్నారు.
Read Also: Lavanya Audio: లావణ్య -మస్తాన్ సాయిల ఆడియో లీక్.. అంతకు మించి అంటూ!
ఈ అంటువ్యాధులను ఎదుర్కోవడానికి ‘వన్ హెల్త్ అప్రోచ్’ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని నడ్డా చెప్పారు. 2022 జూలై నెలలో ప్రధానమంత్రి సైన్స్, టెక్నాలజీ.. ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ (PM-STIAC) ’వన్ హెల్త్ మిషన్’ని స్థాపించాలని సిఫార్సు చేశారు. దేశంలో ప్రస్తుతం ఉన్న అన్ని ఆరోగ్య కార్యకలాపాలను ఏకీకృతం చేయడం దీని లక్ష్యం అని తెలిపారు. అంతేకాకుండా.. కొత్త, అభివృద్ధి చెందుతున్న వ్యాధులను ఎదుర్కోవటానికి నేషనల్ వన్ హెల్త్ మిషన్ (NOHM) ప్రధాన స్తంభం.. ఆధునిక సాంకేతికతతో కూడిన సమగ్ర నిఘా వ్యవస్థ అని నొక్కిచెప్పారు. సమీకృత నిఘా వ్యవస్థ సహాయంతో.. మానవులు, జంతువులు.. వన్యప్రాణులను పర్యవేక్షిస్తుందన్నారు. అంటువ్యాధులపై పరిశోధన కోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ (డిహెచ్‌ఆర్) ద్వారా ఎన్‌ఓహెచ్‌ఎంకు రూ.386.86 కోట్ల బడ్జెట్‌ను విడుదల చేసినట్లు నడ్డా తెలిపారు.
తాజావార్తలు
-
2027 World Cup: : పంత్, శాంసన్‌లకు నో ఛాన్స్.. అశ్విన్ ప్రకటించిన జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!