Jowar Upma Recipe: పొద్దున బ్రేక్ ఫాస్ట్ కి కొంచెం డిఫరెంట్ గా మంచి హెల్తీ అయిన జొన్న ఉప్మా ట్రై చేయండి. రుచీ, ఆరోగ్యం రెండూ కావాలంటే కొత్తగా ఈ జొన్న ఉప్మా తయారుచేసుకొని చేసి ఒక్కసారి తినండి. ఇక అంతే వద్దన్నా కానీ అన్ని రకాల ఉపలను పక్కకు నెట్టేసి ఇదే మీ ఫేవరేట్ అవుతుంది. మరి ఈ క్రేజీ జొన్న ఉప్మా ఎలా తాయారు చేసుకోవాలో చూసేద్దామా..
Samsung Galaxy A07 5G విడుదల.! అదిరే ఫీచర్స్ బడ్జెట్ ధరలోనే..!
ముందుగా ఒక కప్ అంత జొన్నలు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక 10 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టిన జొన్నల్ని ప్రెషర్ కుక్కర్ లో వేసి కావాల్సినంత నీళ్లు పోసి ఫ్లేమ్ మీడియంలో ఉంచి నాలుగు నుంచి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఆ ప్రెషర్ తగ్గిన తర్వాత జొన్నల్ని వడకట్టి తీసి పెట్టుకోవాలి. ఆపై పాన్ లో కొద్దిగా నూనె పోసి దాంట్లో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి రోస్ట్ గా చేయిచుకొని.. కొద్దిగా పల్లీలు వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఎండు మిరపకాయలు కొద్దిగా ఇంగువ వేసి బాగా కలపాలి.
ఇక ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన బీన్స్ క్యారెట్ వేసి బాగా కలుపుకొని.. కొద్దిగా పచ్చి బఠానీలు కూడా వేసి తర్వాత దీంట్లో ఉప్పు, పసుపు, కరివేపాకు వేసి బాగా కలపాలి. ఇక చివరన ఉడకబెట్టిన జొన్నలను వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న ఐదు నిమిషాలు తర్వాత కొద్దిగా నిమ్మరసం, ఫ్రెష్ గా తరిగిన కొబ్బరి, తగినంత కొత్తిమీర వేసి మొత్తం ఒక్కసారి కలిపితే.. భలే టేస్టీ అయిన మంచి హెల్తీ ‘జొన్న ఉప్మా’ రెడీ. చేసిన వెంటనే వేడి వేడిగా తింటే అబ్బా ఉంటది.. అంతే.