Siddique Kappan : ఫలించిన 28నెలల పోరాటం.. జైలునుంచి విడుదలైన జర్నలిస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddique Kappan : కేరళకు చెందిన సిద్ధిక్ కప్పన్ అనే జర్నలిస్ట్ ఉత్తరప్రదేశ్‌లో రెండేళ్ల క్రితం అరెస్టయ్యాడు. యువతిపై అత్యాచారం, హత్య ఆరోపణలపై నివేదించేందుకు వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్లో ఆమె మరణం దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. సిద్ధిక్ కప్పన్ పై ఉన్న రెండు కేసుల్లో బెయిల్ వచ్చి నెలరోజులైనా తాను ఇంకా జైలులోనే ఉన్నాడు. ఇవాళ రిలీజ్ చేశారు. లక్నోలోని స్పెషల్ కోర్టు కప్పన్ ను రిలీజ్ చేస్తూ ఆదేశాలపై సంతకం చేసింది. రాక్షష చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంటానని కప్పన్ తెలిపాడు. తనను బెయిల్ వచ్చినా జైల్లో పెట్టారని, రెండేళ్లు కఠినంగా సాగినా, ఎప్పుడూ భయపడలేదని ఆయన చెప్పాడు.
Read Also: Rains : తమిళనాడును ముంచెత్తిన వానలు.. స్కూళ్లు బంద్
Also Read
- Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
- US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసిన 20 ఏళ్ల దళిత మహిళపై సామూహిక అత్యాచారం, హత్య గురించి నివేదించడానికి ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు వెళుతుండగా అక్టోబర్ 2020లో అరెస్టయ్యాడు. అశాంతి సృష్టించడానికే అక్కడికి వెళ్తున్నాడని పోలీసులు తెలిపారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిన 15 రోజుల తర్వాత ఆ మహిళ ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో మరణించింది. ఆమెను జిల్లా యంత్రాంగం తన గ్రామంలో అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించింది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నటలు విస్తృతంగా ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగింది. అతనిపై దేశద్రోహం కేసు బుక్ చేశారు. 2022 ఫిబ్రవరిలో అతనిపై మనీల్యాండరింగ్ కేసు కూడా నమోదు చేశారు. నిషేధిత పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు తీసుకున్నట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి.
Read Also: Security Guard : ఓనర్‌ను కత్తితో పొడిచిన సెక్యూరిటీ.. అలా చేశాడన్న కోపంతో దారుణం
టెర్రర్ కేసులో గత ఏడాది సెప్టెంబర్‌లో అతనికి బెయిల్ వచ్చింది. ఇక డిసెంబర్లో అతనిపై మనీల్యాండరింగ్ కేసు బుక్కైంది. కానీ అనేక కారణాల వల్ల అతని రిలీజ్‌ను నిలిపివేశారు. టెర్రర్ ఫైనాన్సింగ్‌తో తనకు ఎటువంటి సంబంధం లేదని కప్పన్ తెలిపాడు. కేవలం జర్నలిస్టుగా వార్తలను కవర్ చేసేందుకు హత్రాస్‌కు వెళ్లినట్లు అతను చెప్పాడు.
తాజావార్తలు
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..