Site icon NTV Telugu

Kothapalli Geetha: ప్రచారంలో దూసుకుపోతున్న అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి..

Geetha

Geetha

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ క్రమంలో రాజకీయ పార్టీల నేతలు తమ నియోజకవర్గంలో ప్రచారంలో జోరు పెంచారు. కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికి, ప్రతి గడపకు వెళ్లి తమ పార్టీ అందించే సంక్షేమ పథకాలు, తమ పార్టీకి ఓటు వేయడం ద్వారా భవిష్యత్ లో కలిగే లాభాలను వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏపీలో రాజకీయ పార్టీల నేతలంతా ప్రతీరోజు ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఎలక్షన్లకు సమయం తక్కువగా ఉండటంతో ఎండను కూడా లెక్క చేయకుండా ప్రచారంలో పాల్గొంటున్నారు.

Read Also: Rajnath Singh: పదేళ్ల తర్వాత ఆ పార్టీ ఉండదు.. కాంగ్రెస్ పై రక్షణ శాఖ మంత్రి ఘాటు వ్యాఖ్యలు

ఈ క్రమంలో.. ఎన్డీఏ బలపరిచిన అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కురుపాం నియోజకవర్గం గుమ్మలక్షిపురం మండలంలో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మారుమూల గ్రామాలైన కొత్తవలస, చింతలపాడు గ్రామాలలో పర్యటించిన కొత్తపల్లి గీతకు.. స్థానిక ప్రజలు సంప్రదాయ గిరిజన వాయిద్యాలత, థింసా నృత్యాలతో మహిళలు హారతులతో స్వాగతం పలుకగా గిరిజనులతో కలిసి థింసా నృత్యంలో కొత్తపల్లి గీత అడుగులు కలిపారు. గ్రామాల్లో ఉన్న పలువురు ఓటర్లను కలిసి కమలం గుర్తుకు ఓటువేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని చేసి నినాదాలతో హోరెత్తించారు.

Read Also: Pawan Kalyan: నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే.. గుంటూరు సభలో పవన్ ఫైర్

Exit mobile version