John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
John Turner Retirement at 25: ఇంగ్లండ్ యువ ఫాస్ట్ బౌలర్ జాన్ టర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 25 ఏళ్ల వయసులోనే అన్ని ఫార్మాట్ల ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వరుస గాయాలతో కొంత కాలంగా ఇబ్బంది పడుతున్న టర్నర్.. తన క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ గాయాలు వెంటాడటంతో ఆటకు వీడ్కోలు చెప్పడం సరైన నిర్ణయమని తాను భావించినట్లు టర్నర్ వెల్లడించాడు. 25 ఏళ్లకే గుడ్‌బై చెప్పడంతో క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు.
4 మ్యాచ్‌లలో 3 వికెట్స్:
దక్షిణాఫ్రికాలో జన్మించిన జాన్ టర్నర్ 2024లో ఇంగ్లండ్ తరఫున ఆడేందుకు అర్హత సాధించాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న కొద్దికాలానికే ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 2024లో వెస్టిండీస్ పర్యటనలో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేశాడు. కెరీర్లో అతడు రెండు వన్డేలు, రెండు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. నాలుగు మ్యాచ్‌లలో కలిపి మూడు వికెట్స్ పడగొట్టాడు. క్రికెట్ ఆడటం చిన్నప్పటి నుంచే తన కల అని, ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడటంతో తన చిన్ననాటి కలను నెరవేర్చుకున్నానని టర్నర్ పేర్కొన్నాడు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం తన జీవితంలో తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయాల్లో ఒకటని తెలిపాడు.
Also Read
- R Praggnanandhaa: చెస్ వరల్డ్ లో భారత్ ఆధిపత్యం.. సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
- Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
- Women’s Asia Cup 2026: మరోసారి తలపడనున్న భారత్, పాకిస్థాన్.. మహిళల ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
- Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
అత్యంత కఠిన నిర్ణయం:
‘స్ట్రెస్ ఫ్రాక్చర్‌తో ఏడాదికి పైగా ఆటకు దూరం ఆయను. గతంలో ఎదుర్కొన్న గాయాల చరిత్ర కూడా భవిష్యత్తు గురించి ఆలోచించేలా చేసింది. క్రికెటర్‌గా నా భవిష్యత్తుతో పాటు వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నా. క్రికెట్ ఆడటం చిన్నప్పటి కల. ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడటంతో నా కలను నెరవేర్చుకున్నా. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం నా జీవితంలో తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయం’ అని జాన్ టర్నర్ తెలిపాడు. స్ట్రెస్ ఫ్రాక్చర్ కారణంగా టర్నర్ 2025 జూన్ తర్వాత క్రికెట్ ఆడలేదు. 2025 దేశవాళీ సీజన్లో జరిగిన టీ20 మ్యాచే అతని చివరి ప్రొఫెషనల్ మ్యాచ్. కెరీర్లో అన్ని ఫార్మాట్లలో కలిపి టర్నర్ 53 మ్యాచ్‌లు ఆడి 97 వికెట్లు పడగొట్టాడు.
2021లో ప్రొఫెషనల్ క్రికెట్లో అరంగేట్రం:
టర్నర్ 2021 రాయల్ లండన్ కప్‌లో ప్రొఫెషనల్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే అప్పటి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్‌ను ఔట్ చేశాడు. అనంతరం ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ రాణించాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడి 16 వికెట్లు పడగొట్టాడు. 2024 అక్టోబర్‌లో వెస్టిండీస్ పర్యటనలో టర్నర్ ఇంగ్లండ్ తరపున ఆడాడు. తన రెండో వన్డేలో అంతర్జాతీయ తొలి వికెట్ సాధించాడు. ఆ మ్యాచ్‌లో 2/42 గణాంకాలు నమోదు చేసి.. ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. అదే పర్యటనలో టర్నర్ తన తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడి.. వికెట్ తీశాడు.
వరుస గాయాలు దెబ్బేశాయి:
అంతర్జాతీయ స్థాయిలో మంచి ఆరంభం లభించినప్పటికీ.. వరుస గాయాలు జాన్ టర్నర్ కెరీర్‌ను దెబ్బతీశాయి. తనలో ఉన్న ప్రతిభను పూర్తిస్థాయిలో ప్రదర్శించేందుకు అవకాశం రాకముందే.. 25 ఏళ్ల వయసులోనే క్రికెట్‌కు వీడ్కోలు పలకాల్సి వచ్చింది. ఇకపై క్రికెట్‌కు దూరంగా జీవితంలో తన తదుపరి కార్యాచరణపై దృష్టి సారించనున్నట్లు టర్నర్ ప్రకటించాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టర్నర్‌కు అందరూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
తాజావార్తలు
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్‌న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
-
Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!