తెలంగాణలో బీజేపీ వర్సెస్ బీఆర్‌ఎస్ అన్నట్లుగా రాజకీయం సాగుతోంది. ఇరు పార్టీల నేతల ఒకరిపైఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే.. తాజాగా.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై ఫైర్ అయ్యారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న. తాజాగా జోగు రామన్న ఆదిలాబాద్ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. దమ్ముంటే రైతులను ఎనిమిదిన్నర ఏళ్లలో ఏం చేశారో చెప్పండని ఆయన సవాల్ విసిరారు. అంతేకాకుండా.. డ్రగ్స్ కేసులో కేటీఆర్ కౌంటర్ ఇస్తే తరువాత మాట మార్చారని, జనమే మిమ్మల్సి చెప్పుతో కొడుతారు అంటూ ఆయన ధ్వజమెత్తారు. ఉపాధి హామీ డబ్బులు కల్లాలకు వాడితే కడుపు మంట ఎందుకు అని, తెలంగాణ రైతులంటే అంత కోపం ఎందుకని ఆయన మండిపడ్డారు.
Also Read : Nandamuri Fans: ‘డల్లాస్’ని ‘డల్లాస్ పురం’ చేసారు… ఇదెక్కడి అరాచకం మావా
కిషన్ రెడ్డి కబ్జాలు చేసారని ఆయన ఆరోపించారు. రైతుల గురించి బీజేపీ నేతలకు ఏం తెలియదని, రైతులను మోసం చేస్తేనే అక్కడ ధర్నా లు చేసారన్నారు. కిసాన్ సమ్మన్ నిధి ఏది అని ఆయన ప్రశ్నించారు. ఈ-కేవైసీ, ఆధార్ పేరుతో కొర్రీలు పెడుతున్నారంటూ ఆయన విమర్శలు చేశారు. మోటార్లు మీటర్లు బిగిస్తామన్నారని, రైతు వ్యతిరేక ప్రభుత్వం బీజేపీ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ అవతరించిన తమ పార్టీ.. జాతీయ రాజకీయాల రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషించనుందని ఆయన వ్యాఖ్యానించారు. రైతుల ఆత్మహత్యల తెలంగాణను ఇప్పుడు దేశానికే సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మార్చారని ఆయన వ్యాఖ్యానించారు. దేశమంతా ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోందని, దేశంలో అతి చిన్న వయస్సున రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందన్నారు.