బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (BRIC) డిప్యూటీ డైరెక్టర్ జనరల్, డైరెక్టర్ పోస్టులకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన సంస్థ నుండి పిహెచ్‌డి డిగ్రీ, ఇతర నిర్దేశించిన అర్హతలను కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 50, 56 సంవత్సరాలుగా నిర్ణయించారు.
Also Read:Smriti Mandhana: ఇట్స్ అఫీషియల్.. స్మృతి మంధాన పెళ్లి రద్దు.. ‘ఇక్కడితో ముగించాలనుకుంటున్నా’ అంటూ..!
డిప్యూటీ డైరెక్టర్, డైరెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.1,000, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పదవికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.1,500 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 21. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.