Site icon NTV Telugu

jio phone: అదిరిపోయే ఫీచర్లతో జియో 5జీ స్మార్ట్ ఫోన్

Jio 5g Phone

Jio 5g Phone

jio phone: భారతీయులు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఇక 5G టెక్నాలజీతో మొబైల్ వినియోగదారులు అంతరాయం లేకుండా వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు పొందనున్నారు. దేశంలోని రెండు అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో ఈ సంవత్సరం 5G సేవలను ప్రారంభిస్తామని ప్రకటించాయి. కొన్ని నెలలుగా 5జీ టెక్నాలజీ కోసం తీవ్ర కసరత్తు జరిగింది. పలు టెలికాం కంపెనీలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. ముందు నుంచే 5జీ నెట్‌ వర్క్‌ కోసం ట్రయల్స్‌ సైతం నిర్వహించాయి. ఇప్పుడున్న 4 జీ టెక్నాలజీ కంటే 5 టెక్నాలజీ దాదాపు 10 రేట్లు వేగంగా ఉంటుందని చెబుతున్నారు.

Read also: New Rules: డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు వాడే వారికి అలెర్ట్.. నేటి నుంచి కొత్త రూల్స్..

ఎన్నో నెలలుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 5 జీ టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పటికే వినియోగదారులు 5జీ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసి తమ సిమ్ కార్డులను అప్ గ్రేడ్ చేసుకునే పనిలో పడ్డారు. స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థలు సైతం ఇప్పటికే 5జీ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి జియో స్మార్ట్‌ఫోన్‌పై పడింది. తాజాగా జియో 5జీ స్మార్ట్ ఫోన్‌పై ప్రజల్లో చర్చ నడుస్తోంది. జీయో స్మార్ట్ ఫోన్ ఫోన్‌ గురించి నెట్టింట పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జియో కంపెనీ తమ స్మార్ట్ ఫోన్ ను దీపావళి నాటికి మార్కెట్లోకి తేనుందని సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్‌కు జియో గంగా అనే కోడ్‌ నేమ్‌ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ. 8 వేల నుంచి రూ. 12 వేల మధ్య ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎల్‌వైఎఫ్‌ కంపెనీ భాగస్వామ్యంతో జియో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది.

Read also:Pak Twitter Account: భారత్‌లో మరోసారి పాకిస్థాన్‌ అధికారిక ట్విట్టర్ ఖాతా నిలిపివేత

ప్రస్తుతం అందుతున్న సమాచారం ఆధారంగా జియో కంపెనీ తేబోతున్న ఫోన్‌ 6.5 ఇంచెస్‌ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే కలిగిఉంటుంది. స్నాప్‌డ్రాగన్‌ 480 ప్రాసెసర్‌తో కూడిన ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 12 బేస్డ్‌ ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనుంది. 13 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, 8 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరాతో రానున్నట్లు సమాచారం. గూగుల్‌ లెన్స్‌, ట్రాన్స్‌లేట్‌ లాంటి గూగుల్‌ యాప్స్‌ ఇన్‌బిల్ట్‌గా ఇవ్వనున్నారని తెలుస్తోంది. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 18 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లో ఈ ఫోన్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి.

Exit mobile version