దేశంలోని ప్రముఖ టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో కొత్త రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చాయి. ట్రాయ్ ఆదేశాల మేరకు వాయిస్, ఎస్సెమ్మెస్ యూజర్ల కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలను లాంచ్ చేశాయి. డేటా అవసరం లేని వారికి ఈ ప్లాన్స్ బాగా ఉపయోగపడతాయి. ఎయిర్‌టెల్, జియో సంస్థలు రెండు చొప్పున రీఛార్జ్ ప్లాన్లు తీసుకొచ్చాయి. కొత్త రీఛార్జ్ ప్లాన్ల ఫుల్ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.
వాయిస్, ఎస్సెమ్మెస్‌ల కోసం ప్రత్యేకంగా రెండు రీఛార్జ్ ప్లాన్లను (రూ.499, రూ.1959) ఎయిర్‌టెల్ తీసుకొచ్చింది. 84 రోజుల వ్యాలిడిటీ గల రూ.499 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 900 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. రూ.1959 ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3600 ఎస్సెమ్మెస్‌లు వాడుకోవచ్చు. ఈ రెండు ప్లాన్‌లపై మూడు నెలల పాటు అపోలో 24/7 సర్కిల్ మెంబర్‌షిప్, హలో ట్యూన్ ప్రయోజనాలు పొందొచ్చు. ఈ రెండింటితో పాటు రూ.548, రూ.2249 ప్లాన్‌లను కూడా ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టింది.
Also Read: Rohit Sharma: అయ్యో రాములా.. మళ్లీ నిరాశపర్చిన రోహిత్!
వాయిస్, ఎస్సెమ్మెస్‌ల కోసం రూ.458, రూ.1958 ప్లాన్‌లను రిలయన్స్ జియో ప్రవేశపెట్టింది. రూ.458 ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు కాగా.. అన్‌లిమిటెడ్ వాయిస్‌కాల్స్, 1000 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. అదనంగా జియో టీవీ, సినిమా, క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ సదుపాయాలు లభిస్తాయి. రూ.1958 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3600 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 365 రోజులు. ఇందులో కూడా జియో టీవీ, సినిమా, క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ సదుపాయాలు ఉన్నాయి.