JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
- రూ.3,599 వార్షిక ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ
- ప్రతిరోజూ 2.5GB హైస్పీడ్ డేటా
- దేశవ్యాప్తంగా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు
- 18 నెలల Google Gemini Pro AI సబ్స్క్రిప్షన్ ఉచితంగా
- 5TB (5,000GB) క్లౌడ్ స్టోరేజ్ ప్రయోజనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JIO: రిలయన్స్ జియో తన 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక వార్షిక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.3,599 ధరతో లభించే ఈ ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీతో పాటు సాధారణ టెలికాం సేవలతో పాటు అదనంగా క్లౌడ్ స్టోరేజ్, AI సబ్స్క్రిప్షన్లు, ఎంటర్టైన్మెంట్ సేవలు, షాపింగ్, ట్రావెల్ వోచర్లు వంటి అనేక ప్రయోజనాలను అందిస్తోంది.
రోజుకు 2.5GB డేటా..
రూ.3,599 వార్షిక ప్లాన్‌లో ప్రతిరోజూ 2.5GB హైస్పీడ్ 4G డేటా లభిస్తుంది. 5Gకి అనుకూలమైన డివైజ్, ప్రాంతాల్లో అన్లిమిటెడ్ 5G డేటాను కూడా వినియోగించుకోవచ్చు. అలాగే దేశవ్యాప్తంగా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు 365 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌లో లభిస్తాయి. వీటితో పాటు ఈ ప్లాన్‌లో సాధారణ రోజువారీ డేటాకు అదనంగా 120GB బోనస్ డేటాను కూడా జియో అందిస్తోంది. 12 నెలల పాటు ప్రతి నెల 10GB చొప్పున డేటా వోచర్ల రూపంలో ఈ ప్రయోజనం లభిస్తుంది. దీంతో ఎక్కువ డేటా వినియోగించే వారికి ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది.
Also Read
- Samsung Galaxy A18 4G: సామ్ సంగ్ గెలాక్సీ A18 4G.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో కొత్త బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు లీక్
- Huawei Mate XT 2: హువావే మేట్ XT 2 ట్రై-ఫోల్డ్ 5G ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్.. 16GB RAM, 2TB స్టోరేజ్, 6000mAh బ్యాటరీ!
- OnePlus Ace 7 Pro: 200MP కెమెరా, 16GB RAMతో వన్‌ప్లస్ Ace 7 Pro.. ఫీచర్లు లీక్!
- Lenovo Yoga Tab Plus Gen 2: 12,700mAh బ్యాటరీ.. 4K 144Hz డిస్ప్లే.. లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2 వచ్చేసింది
18 నెలల AI సబ్స్క్రిప్షన్ ఫ్రీ..
ఈ వార్షిక రీఛార్జ్‌లో బాగా ఉపయోగపడే ప్రయోజనాల్లో AI సబ్స్క్రిప్షన్ ఒకటి. వినియోగదారులకు 18 నెలల పాటు గూగుల్ జెమినీ ప్రో సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. దీంతో AI ఆధారిత ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా నానో బనానా ఏఐ టూల్ యాక్సెస్, 5TB అంటే 5,000GB క్లౌడ్ స్టోరేజ్‌ను కూడా అందిస్తున్నారు.
జియోహాట్‌స్టార్, జియోటీవీ ప్రో..
మరోవైపు ఎంటర్టైన్మెంట్ కోసం జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ కూడా ఈ ప్లాన్‌లో భాగంగా ఉంది. ఇందులో హాలీవుడ్ కంటెంట్‌ను కూడా వీక్షించవచ్చు. అంతేకాకుండా ఏడాది పాటు జియోటీవీ ప్రో ప్యాక్‌ను ఉచితంగా అందిస్తున్నారు. దీని ద్వారా 1,000కి పైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు.
ట్రావెల్, షాపింగ్, మూవీ వోచర్లు..
డిజిటల్ సేవలతో పాటు ట్రావెల్, షాపింగ్, ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన డిస్కౌంట్ వోచర్లను కూడా జియో అందిస్తోంది. ఈజ్‌మైట్రిప్ ద్వారా విమానాలు, హోటళ్ల బుకింగ్‌పై గరిష్ఠంగా రూ.2,200 విలువైన వోచర్లు లభిస్తాయి. అలాగే రూ.1,000 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోళ్లపై ఉపయోగించుకునే రూ.200 అజియో డిస్కౌంట్ వోచర్, సినీపోలిస్‌లో ఉపయోగించుకునే రూ.150 డిస్కౌంట్ వోచర్ కూడా ఉన్నాయి. జియో 10వ వార్షికోత్సవ ప్రత్యేక ప్లాన్‌ను మైజియో యాప్, జియో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అధీకృత రిటైల్ స్టోర్ల ద్వారా కూడా పొందవచ్చు.
తాజావార్తలు
-
Aqua Farmers: ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం.. నేడు రాష్ట్రస్థాయి సదస్సులో కీలక చర్చ
-
Samsung Galaxy A18 4G: సామ్ సంగ్ గెలాక్సీ A18 4G.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో కొత్త బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు లీక్
-
Nayanthara: లేడీ సూపర్‌స్టార్‌కు 2026లో వరుస షాక్‌లు.. ఆ ఒక్క హిట్ తర్వాత ఎందుకిలా?
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Telangana Assembly 2026: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. 20 అంశాలపై చర్చకు బీఆర్ఎస్ డిమాండ్.. కేసీఆర్ వస్తారా?
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!