Telangana Assembly 2026: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. 20 అంశాలపై చర్చకు బీఆర్ఎస్ డిమాండ్.. కేసీఆర్ వస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly Session 2026: తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. తొలిరోజు ప్రశ్నోత్తరాలతో శాసనసభ, మండలి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. సభ ప్రారంభమైన తర్వాత పలు కీలక నివేదికలను సభ ముందుకు తీసుకురానున్నారు. తొలిరోజు ‘తెలంగాణ సమగ్ర శిక్షణ’, ‘పీఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా’, మెట్రో రైలుకు సంబంధించిన ఆడిట్ నివేదికలను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఉభయ సభలు వాయిదా పడే అవకాశముంది.
ఈసారి అసెంబ్లీ సమావేశాలు సుమారు నాలుగు నుంచి ఆరు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. చర్చించాల్సిన అంశాల ప్రాధాన్యాన్ని బట్టి సమావేశాల గడువును మరింత పొడిగించే అవకాశమూ ఉంది. సభ నిర్వహణ, పని దినాలు, చర్చించాల్సిన అంశాలు, అజెండాపై స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశంలో చర్చించనున్నారు. సభలో ఏ అంశాలకు ఎంత సమయం కేటాయించాలనే దానిపై కూడా BACలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Also Read
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
- Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. తన ప్రభుత్వం సాధించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించేందుకు అధికారపక్షం సిద్ధమవుతోంది. వివిధ శాఖల పనితీరు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అంశాల వారీగా ప్రస్తావించే అవకాశం ఉంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో వైఫల్యాలను ప్రధాన అజెండాగా ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వ హామీలు, అమలు తీరు, ప్రజా సమస్యలపై అధికారపక్షాన్ని నిలదీసే అవకాశం ఉంది.
అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాల జాబితాలో సుమారు 20 అంశాలను చేర్చాలని బీఆర్ఎస్ బీఏసీ సమావేశంలో కోరనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సమావేశాలను కేవలం కొన్ని రోజులకు పరిమితం చేయకుండా నెల రోజుల పాటు నిర్వహించాలనే డిమాండ్‌ను కూడా ఆ పార్టీ ముందుకు తీసుకురానుంది. సభ ప్రారంభానికి ముందు ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నిరసన తెలుపుతూ అసెంబ్లీకి వెళ్లనున్నారు.
ఈసారి కూడా ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన గైర్హాజరీలో బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీలో ఎవరు ప్రభుత్వాన్ని ఎలా నిలదీస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈసారి రాజకీయంగా వాడీవేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ తన వెయ్యి రోజుల పాలనను సమర్థించుకునేందుకు సిద్ధమవుతుండగా.. బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో సభలో కీలక అంశాలపై తీవ్ర చర్చ జరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!