Lenovo Yoga Tab Plus Gen 2: 12,700mAh బ్యాటరీ.. 4K 144Hz డిస్ప్లే.. లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2 వచ్చేసింది
- లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2 రిలీజ్
- 4K 144Hz స్క్రీన్, Snapdragon 8 Elite
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lenovo Yoga Tab Plus Gen 2: ప్రముఖ టెక్ కంపెనీ లెనోవో కొత్త ప్రీమియం ట్యాబ్లెట్ Yoga Tab Plus Gen 2ను IFA 2026 వేదికగా విడుదల చేసింది. అత్యాధునిక హార్డ్‌వేర్‌తో వచ్చిన ఈ ట్యాబ్లెట్లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 13 అంగుళాల 4K డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 12,700mAh భారీ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. పెద్ద స్క్రీన్, శక్తివంతమైన ప్రాసెసర్, ఎక్కువ స్టోరేజ్, ప్రీమియం ఆడియో వంటి ఫీచర్లతో లెనోవా ఈ ట్యాబ్లెట్‌ను రూపొందించింది. దీని ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్లను ఇప్పుడు వివరంగా చూద్దాం.
Lenovo Yoga Tab Plus Gen 2 ధర
లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2 ప్రారంభ ధర 849 యూరోలుగా నిర్ణయించింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.93,000కు సమానం. ఈ ట్యాబ్లెట్ కాస్మిక్ బ్లూ కలర్లో అందుబాటులోకి వస్తుంది. ఇది మూడు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది.
Also Read
- 100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
- 8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
- Vivo S2 FE: 10,000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP68 + IP69 రేటింగ్.. వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్..
- Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
12GB RAM + 256GB Storage
16GB RAM + 256GB Storage
16GB RAM + 512GB Storage
కంపెనీ ప్రకారం ఈ నెల చివర్లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. అయితే భారత మార్కెట్లో దీని ధర, అమ్మకాల తేదీపై ప్రస్తుతం స్పష్టత లేదు.
13 అంగుళాల 4K డిస్ప్లే
ఈ ట్యాబ్లెట్లో 13 అంగుళాల 4K డిస్ప్లే అందించారు. ఇది 3,840 × 2,560 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. డిస్ప్లే ప్రత్యేకతల్లో ముఖ్యంగా 144Hz రిఫ్రెష్ రేట్ చెప్పుకోవచ్చు. వినియోగాన్ని బట్టి స్క్రీన్‌ను 120Hz, 90Hz, 60Hz, 30Hz రిఫ్రెష్ రేట్లలో కూడా ఉపయోగించుకోవచ్చు. స్క్రీన్ గరిష్టంగా 1,100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది. HDR కంటెంట్ కోసం Dolby Vision సపోర్ట్ కూడా ఉంది. అంతేకాకుండా 3:2 యాస్పెక్ట్ రేషియో, 355ppi పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంది.
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్
పనితీరు కోసం లెనోవో ఇందులో Qualcomm Snapdragon 8 Elite చిప్‌సెట్‌ను ఉపయోగించింది. ప్రీమియం ట్యాబ్లెట్ సెగ్మెంట్‌కు తగిన విధంగా శక్తివంతమైన పనితీరును అందించడమే లక్ష్యంగా ఈ ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో గరిష్టంగా 16GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. అదనంగా మైక్రోSD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించుకోవచ్చు.
Android 17తో వస్తుంది
సాఫ్ట్వేర్ పరంగా Lenovo Yoga Tab Plus Gen 2 Android 17 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. లెనోవో ప్రకారం ఈ ట్యాబ్లెట్‌కు ఏడు OS అప్గ్రేడ్లు, అలాగే 2033 వరకు ఏడు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అందించనుంది. అయితే OS, సెక్యూరిటీ అప్డేట్ల లభ్యత మార్కెట్, డివైస్ లభ్యత వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని కంపెనీ పేర్కొంది.
కెమెరాలు ఎలా ఉన్నాయి?
కెమెరా విభాగంలో వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు.
13MP ప్రైమరీ కెమెరా
2MP మాక్రో కెమెరా
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8MP సెన్సార్‌తో పాటు 0.3MP VGA సెన్సార్ అందించారు.
కనెక్టివిటీ ఫీచర్లు
Wi-Fi 7
Bluetooth 6.0
USB Type-C 3.2 Gen 1
Three-point Pogo Pin Connector
పోగో పిన్ కనెక్టర్ సహాయంతో ట్యాబ్లెట్‌కు అనుబంధ యాక్సెసరీలను కనెక్ట్ చేసుకోవచ్చు.
12,700mAh భారీ బ్యాటరీ
Lenovo Yoga Tab Plus Gen 2లో 12,700mAh బ్యాటరీ అందించారు. దీనికి 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. పెద్ద డిస్ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్ ఉన్నప్పటికీ భారీ బ్యాటరీ కారణంగా ఎక్కువసేపు ట్యాబ్లెట్‌ను ఉపయోగించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఆరు స్పీకర్లతో ప్రీమియం ఆడియో
ఆడియో కోసం ఇందులో ఆరు స్పీకర్లు ఉన్నాయి. వీటికి Harman Kardon బ్రాండింగ్ కూడా ఉంది. వీడియోలు చూడటం, మ్యూజిక్ వినడం, గేమింగ్ వంటి అవసరాలకు మెరుగైన ఆడియో అనుభవాన్ని అందించేలా స్పీకర్ సెటప్‌ను రూపొందించారు.
కీబోర్డ్, స్టైలస్ సపోర్ట్
లెనోవా యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2ను Lenovo One-Step Clamshell Magnetic Keyboardతో ఉపయోగించుకోవచ్చు. దీంతో ట్యాబ్లెట్‌ను ల్యాప్‌టాప్ తరహాలో కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇది Tab Pen Pro 2కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో ‘Squeeze to Select’, ‘Click to Draw’ వంటి ఫీచర్లు ఉన్నాయి. నోట్-టేకింగ్, డ్రాయింగ్, క్రియేటివ్ వర్క్ చేసే వారికి స్టైలస్ సపోర్ట్ ఉపయోగకరంగా ఉంటుంది.
బరువు, డిజైన్
ఈ ట్యాబ్లెట్ బరువు సుమారు 605 గ్రాములు. ప్రీమియం డిజైన్‌తో పాటు పెద్ద డిస్ప్లేను కలిగి ఉన్నప్పటికీ బరువును నియంత్రించేలా లెనోవో దీనిని రూపొందించింది.
తాజావార్తలు
-
Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
-
MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
CM Chandrababu: వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
ట్రెండింగ్
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!