Aqua Farmers: ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం.. నేడు రాష్ట్రస్థాయి సదస్సులో కీలక చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aqua Farmers: ఆక్వా రంగాన్ని ఓవైపు ఫీడ్ ధరలు.. ఎగుమతులపై ఆంక్షలు.. ఇలా వరుసగా సమస్యలు వేధిస్తున్నాయి.. అయితే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి ఆక్వా రైతుల సదస్సు జరగనుంది. ఆక్వా రంగాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్యలపై సదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు. ముఖ్యంగా ఫీడ్ ధరలను ఒకే నెలలో రెండుసార్లు పెంచడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించడం, ప్రాసెసింగ్ ప్లాంట్ల తీరుపై చర్చించడం, నాణ్యమైన సీడ్ సరఫరా వంటి అంశాలు సదస్సులో ప్రధానంగా ప్రస్తావనకు రానున్నాయి. ట్రేసబిలిటీ లేని హేచరీలపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేయనున్నారు.
ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ పెంచాలని, వాటర్ మోటార్ల విద్యుత్ వినియోగంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. NCEL ద్వారా రొయ్యల కొనుగోళ్లు, కేంద్ర ప్రభుత్వ జోక్యం, రైతులు చెల్లించే ఆక్వా సెస్‌ను తిరిగి రైతుల సంక్షేమానికే వినియోగించడం, NFDB ద్వారా సబ్సిడీలు అందించడం వంటి అంశాలపైనా చర్చ జరగనుంది. అలాగే ఆక్వా రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న వైరస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు విజ్ఞప్తి చేయనున్నారు. ఆక్వా రైతుల భవిష్యత్తుకు కీలకమైన ఈ సదస్సుకు భారీగా తరలివచ్చి సమస్యల పరిష్కారానికి తమ గళాన్ని వినిపించాలని నిర్వాహకులు రైతులకు పిలుపునిచ్చారు.
Also Read
- Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
- Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్‌లైన్
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
- Crocodile Captured in Konaseema: 6 నెలలుగా భయాందోళనలో రైతులు.. ఎట్టకేలకు చిక్కిన మొసలి..
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?