Jharkhand Love Affair: ప్రేమ వ్యవహారం కాస్త ఒకరి హత్యకు దారి తీసిన ఘటన జార్ఖండ్‌లోని పలము జిల్లాలో వెలుగులోకి వచ్చింది. 22 ఏళ్ల యువకుడిని అతని ప్రియురాలి కుటుంబం హత్య చేసి, దానిని ప్రమాదంగా చూపించడానికి మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై వదిలేశారు. ప్రశాంతంగా హత్యను ఆత్మహత్యగానో, లేదా ప్రమాదంగానో చిత్రీకరించామని అనుకొని వాళ్లు అక్కడి నుంచి చల్లగా తప్పించుకున్నారు. కానీ చట్టం అనేది ఒకటి ఉన్నదన్న విషయాన్ని వాళ్లు మర్చిపోయినట్లు ఉన్నారు. ఆ చట్టం తమ పని తాము చేసుకుంటూ పోతే ఈ మృతికి అసలు కారకులు బయటికి వచ్చారు.
వెలుగులోకి షాకింగ్ నిజం..
ఆగస్టు 16వ తేదీన పాలములోని మేదినీనగర్ జోగియాహిలోని రైల్వే ట్రాక్ సమీపంలో ఒక యువకుడి మృతదేహం రైల్వే ట్రాక్‌పై పడి ఉండటం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. మృతి చెందిన యువకుడిని 22 ఏళ్ల అమరేంద్ర సింగ్ అలియాస్ బబ్లూగా పోలీసులు గుర్తించారు. మొదట్లో పోలీసులు ఈ కేసును రైల్వే ప్రమాదం అనుకున్నారు. కానీ బాధితుడి కుటుంబం హత్యగా అనుమానం వ్యక్తం చేయడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. వారి దర్యాప్తులో షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చాయి. బబ్లు గత ఐదేళ్లుగా ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు తేలింది. 2022 సంవత్సరంలో ఆ అమ్మాయి కుటుంబం ఆమెకు వేరొకరితో వివాహం చేసింది. అయినప్పటికీ వాళ్లిద్దరూ ఒకరినొకరు కలుసుకుంటూనే ఉన్నారు. విషయం అమ్మాయి కుటుంబానికి తెలియడంతో బబ్లు మృతికి దారి తీసింది.
నలుగురు నిందితులు అరెస్టు..
హత్య కేసులో బబ్లు ప్రియురాలి కుటుంబంలోని నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన తాడు, టవల్, ఒక మొబైల్ ఫోన్, మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ హత్యకు మూల కారణం పాత ప్రేమ వ్యవహారమని, ఆ అమ్మాయి కుటుంబం దానిని ఏ విధంగానూ అంగీకరించలేదని పోలీసు అధికారులు చెప్పారు.
READ MORE: APPAR ID: CBSE కీలక నిర్ణయం.. ఇకపై విద్యార్థులకు ఆ ఐడి లేనట్లయితే బోర్డు పరీక్షలు రాయలేరు!