NTV Telugu Site icon

Jeevan Reddy : నేను మాట్లాడితే ఎమ్మెల్యే సంజయ్ ఉలిక్కి పడడం ఎందుకు ..

Jeevan Reddy

Jeevan Reddy

Jeevan Reddy : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ నైతిక విలువల గురించి తన అభిప్రాయాలు వెల్లడించగానే, ఎమ్మెల్యే సంజయ్ ఉలిక్కి పడటం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు.

“మా తాతలూ, తండ్రులూ కాంగ్రెస్‌లో ఉండేవారు అంటూ చెప్పేవారు. కానీ మీకు అనుకూలంగా పరిస్థితులు లేకపోతే తిరుగుబాటు చేసి పార్టీకి వ్యతిరేకంగా నడవడం నిజమైన సిద్ధాంతమా?” అంటూ ప్రశ్నించారు. “చొక్కారావు గారు కాంగ్రెస్‌ను వీడి కరీంనగర్‌ నుంచి జనతా పార్టీ తరఫున పోటీ చేశారు. ఇప్పుడు మీకు అవకాశమైతే కాంగ్రెస్, లేదంటే మరో పార్టీ — ఇదేనా రాజకీయం?” అని నిలదీశారు.

ఎమర్జెన్సీ సమయంలోనూ కాంగ్రెస్ పార్టీకే మద్దతుగా నిలిచిన కొద్దిమందిలో తానొకడినని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 14 పంచాయతీ సమితుల్లో 13 మంది అధ్యక్షులు కాంగ్రెస్‌లో చేరినా, తాను ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా తన విధానం పాటించానని తెలిపారు.

“టీడీపీలో రామారావుతో విభేదించి మంత్రి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాను. పార్టీ ఆదేశాల మేరకు 2008లోనే కేసీఆర్‌పై ఎంపీగా పోటీ చేశాను. 2014లో ఉమ్మడి కరీంనగర్‌ నుంచి ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచాను,” అని గుర్తు చేశారు.

“ప్రతిపక్ష అభ్యర్థిగా ఉన్నా, జగిత్యాల ప్రజలు నన్ను గెలిపించారు. వారి రుణం నేను జీవితాంతం మరిచిపోలేను,” అని చెప్పారు. “ఎన్ని అడ్డంకులు వచ్చినా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడమే నా ధ్యేయం. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త లక్ష్యం కావాలి,” అని జీవన్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.

Prabhas Spirit: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ రెగ్యులర్ షూట్ షురూ?