Jeep Grand Cherokee: జీప్ ఇండియా తమ ప్రీమియం ఎస్‌యూవీగా పరిగణించే గ్రాండ్ చెరోకీకి మరో ప్రత్యేక మోడల్ ను అందుబాటులోకి తెచ్చింది. “సిగ్నేచర్ ఎడిషన్” పేరుతో విడుదలైన ఈ మోడల్, స్టాండర్డ్ వెర్షన్‌కి అదనంగా అనేక ఫీచర్లు, ఆకర్షణీయమైన ఫీచర్స్ తో లభించనుంది. ఈ జీప్ గ్రాండ్ చెరోకీ సిగ్నేచర్ ఎడిషన్‌లో అదే 2.0 లీటర్ టర్బోపెట్ట్రోల్ ఇంజన్ రానుంది. ఇది 268 Hp శక్తి, 400 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఇది అందించబడుతుంది.
Read Also: Viral Video: పెళ్లి వేడుకలో ఊహించని ఘటన.. ఒక్కసారిగా కూలిన ఇంటి మేడ.. చివరకు..?
సిగ్నేచర్ ఎడిషన్‌లో రియర్ సీటు ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో రెండు 11.6 అంగుళాల ఆండ్రాయిడ్ ఆధారిత IPS స్క్రీన్లు, బిల్ట్-ఇన్ స్పీకర్లు, బ్లూటూత్, AUX కనెక్టివిటీ ఉన్నాయి. అంతేకాకుండా ముందు, వెనుక డాష్ కెమెరాలు, మోటరైజ్డ్ సైడ్ స్టెప్స్ వంటి భద్రతా ఇంకా సౌకర్య ఫీచర్లు ఉన్నాయి. డిజైన్ పరంగా ఇది లిమిటెడ్ (O) వేరియంట్‌లానే ఉంటుంది. బాక్సీ శరీర ఆకృతి, క్లామ్‌షెల్ బోనెట్, జీప్‌కు చిహ్నంగా నిలిచే ఏడు స్లాట్ గ్రీల్ వంటివి ఇందులో కొనసాగుతాయి. అంతర్గతంగా కూడా స్టాండర్డ్ వెర్షన్ లేఅవుట్‌ను కొనసాగించింది.
Read Also: Blaupunkt QLED Google TV: బ్లాపంక్ట్ కొత్త QLED టీవీ మోడల్స్ విడుదల.. ధర ఎంతంటే?
ఈ ఎస్‌యూవీ ధరను రూ. 69.04 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించారు. ఇది భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ GLE, వోల్వో XC90, బీఎండబ్ల్యూ X5, ఆడి Q7 వంటి విలాసవంతమైన ఎస్‌యూవీలకు పోటీగా నిలవనుంది. ఈ ప్రత్యేక ఎడిషన్ జీప్ ప్రేమికులకు ఒక అదనపు ఆకర్షణగా మారనుంది. అదనపు ఫీచర్లు, రఫ్ అండ్ టఫ్ బిల్డ్ క్వాలిటీతో ఇది లగ్జరీ సర్వీస్‌ను కోరుకునే వారికి మంచి ఎంపికగా నిలుస్తుంది.