Kailash Mahto:బీహార్‌కు చెందిన జేడీయూ సీనియర్ నేత కైలాష్ మహతో దారుణంగా హత్యకు గురయ్యారు. ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తు తెలియని దుండగులు గురువారం కతిహార్‌లో గుర్తుతెలియని బైక్‌పై వచ్చిన దుండగులు కాల్చి చంపారు. కటిహార్ జిల్లాలోని బరారీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన ఇంటికి సమీపంలో ఈ ఘటన జరిగింది. 70 ఏళ్ల జేడీయూ నాయకుడి పొట్టపైనా, తలపైనా పలుసార్లు కాల్చారు. భూవివాదమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, భద్రత కల్పించాలని కైలాశ్ కొన్ని రోజుల క్రితమే అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అంతలోనే ఈ హత్య జరగడం గమనార్హం.
కైలాష్ మహ్తో బరారి ఠాణా పరిధిలోని పుర్బి బారి నగర్ పంచాయతీ వార్డు నంబర్ 12లో నివాసం ఉండేవాడు. కైలాశ్ హత్యపై కేసు నమోదు చేసుకున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని కటిహార్ ఎస్‌డీపీవో ఓం ప్రకాశ్ తెలిపారు. నిందితులు ఆయనపై నాలుగైదు రౌండ్లు కాల్పులు జరిపినట్టు చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు.
Read Also: Kaur Singh: భారత బాక్సింగ్ దిగ్గజం కౌర్ సింగ్ ఇక లేరు..
జేడీయూ నేత గురువారం సాయంత్రం 5 గంటలకు బరారీ బజార్ నుంచి తన ఇంటికి వెళ్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ సమయంలో, అతను టీ తాగడానికి అనిల్ షా షాప్ వద్ద కూర్చున్నాడు. అక్కడి నుంచి లేచిన తర్వాత అతను ముందుకు వెళ్లగానే బైక్‌పై వచ్చిన నేరస్థులు అతడిపై కాల్పులు జరిపారు. నిందితుడు వచ్చి నేరుగా అతని పొట్టపైనా, తలపైనా కాల్పులు జరిపాడు. ఈ సమయంలో నేరస్థులను పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నంచగా.. గాల్లోకి కాల్పులు జరిపి వారిని భయందోళనలకు గురిచేసి నేరస్థులు తప్పించుకున్నారు.