HD Revanna: కిడ్నాప్ కేసులో హెచ్డీ రేవణ్ణకు ఊరట.. బెయిల్ మంజూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక బాధితురాలిని కిడ్నాప్ చేసిన కేసులో ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణకు ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిలును ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ సోమవారం మంజూరు చేశారు. రూ.5 లక్షల పూచీకత్తుతో పాటు కొన్ని షరతులు విధించారు.
ఇది కూడా చదవండి: luxury home sales: భారత్ లో ఐదేళ్లలో మూడు రెట్లు పెరిగిన విలాసవంతమైన గృహాల అమ్మకాలు..
Also Read
- Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
కిడ్నాపింగ్ కేసులో హెచ్డీ రేవణ్ణ దాఖలు చేసిన ముందస్తు బెయిలును ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తోసిపుచ్చడంతో మే 4న ఆయన పోలీసులు అరెస్టు చేశారు. మే 8 వరకూ పోలీసు కస్టడీకి కోర్టు అప్పగించింది. ఆ తర్వాత మే 14 వరకూ ఆయనకు జ్యూడిషయల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో ఆయన బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల బాధితురాలిని హెచ్డీ రేవణ్ణ ఆదేశాలతోనే ఆయన అనుచరుడు ఏప్రిల్ 29న ఇంటి నుంచి అపహరించుకు వెళ్లినట్టు కోర్టుకు సిట్ తన వాదన వినిపించింది. మే 5న హెచ్డీ రేవణ్ణ సన్నిహితునికి చెందిన ఒక పొలంలో బాధిత మహిళను కనుగొన్నట్టు తెలిపింది. ఇరువర్గాల వాదనలు విన్న ప్రత్యేక కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం తీర్పును వెలువరిస్తూ రేవణ్ణకు షరతులతో కూడిన బెయిలును మంజూరు చేసింది.
ఇది కూడా చదవండి: Mumbai: తుఫాన్ బీభత్సం.. హోర్డింగ్ కూలి 8 మంది మృతి, 59 మందికి గాయాలు
ఇదిలా ఉంటే లైంగిక వేధింపుల పెన్‌డ్రైవ్ బయటపడగానే ప్రజ్వల్ విదేశాలకు పారిపోయాడు. ఆయనకు దర్యాప్తు సంస్థ లుకౌట్ నోటీసులు ఇచ్చింది. ఏ క్షణంలోనైనా ప్రజ్వల్‌ను అరెస్ట్ చేసేందుకు సిట్ సిద్ధంగా ఉంది.
ఇది కూడా చదవండి: MS Dhoni: రాబోయే సంవత్సరాల్లో చెన్నైలో ‘ధోని’ దేవాలయాలు కడతారు..
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!