బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్.. ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాసింది ప్రపంచవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లకుపైగా వసూలు చేసింది..పఠాన్ సినిమా తర్వాత ఒకే ఏడాది రూ.1000 కోట్ల కలెక్షన్ల సినిమాలు రెండు ఇచ్చిన తొలి హీరోగా షారుక్ నిలిచాడు. అట్లీ కుమార్ డైరెక్ట్ చేసిన జవాన్ మూవీలో నయనతార, దీపికా పదుకోన్, విజయ్ సేతుపతి మరియు ప్రియమణి నటించారు. జవాన్ మూవీ ఓటీటీలో కూడా దుమ్ము రేపుతోంది. అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.ఈ సినిమా ఓటీటీలో అత్యధిక మంది చూసిన బాలీవుడ్ సినిమాగా నిలిచింది. ఈ క్రమంలో గంగూబాయి కఠియావాడి రికార్డు బ్రేక్ చేసింది.జవాన్ మూవీ అక్టోబర్ 30 నుంచి నవంబర్ 5 మధ్య ఏకంగా 1.49 కోట్ల వాచింగ్ హవర్స్ నమోదు చేయడం గమనార్హం..
గతంలో ఆలియా భట్ నటించిన గంగూబాయి కఠియావాడి పేరు మీద ఈ రికార్డు ఉండేది. ఆ సినిమా 1.38 కోట్ల వాచింగ్ హవర్స్ నమోదు చేసింది. జవాన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ఫ్యాన్స్.. ఈ మూవీ ఓటీటీ లోకి రావడం తోనే ఎగబడి చూసేశారు.హిందీతోపాటు తెలుగు, తమిళ వెర్షన్లు కూడా నెట్‌ఫ్లిక్స్ లోనే స్ట్రీమ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ మూవీస్ లో జవాన్ హిందీ వెర్షన్ మొదటి స్థానం లో ఉండగా తెలుగు వెర్షన్ 5 వ స్థానం లో తమిళ వెర్షన్ 8వ స్థానం లో ఉండటం విశేషం గతేడాది టాలీవుడ్ తోపాటు పాన్ ఇండియా స్థాయిలో రిలీజై సంచలనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డుకు కూడా జవాన్ దగ్గరవుతోంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో అత్యధిక మంది చూసిన ఇండియన్ మూవీ గా ఆర్ఆర్ఆర్ సినిమాకు రికార్డు ఉంది. ఈ సినిమా ఏకంగా 1.84 కోట్ల వ్యూయింగ్ హవర్స్ నమోదు చేయడం విశేషం. జవాన్ జోరు చూస్తుంటే ఈ రికార్డు బ్రేక్ చేయడం ఖాయంగా అయితే కనిపిస్తోంది.