NTV Telugu Site icon

Team India: టీమిండియాకు మరో షాక్.. కీలక బౌలర్‌కు గాయం..!

Bumrah

Bumrah

న్యూజిలాండ్‌తో శుక్రవారం జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. అయితే.. అతనికి గాయం ఎంత తీవ్రంగా ఉందనే దానిపై బీసీసీఐ అప్‌డేట్ ఇవ్వలేదు. ఇప్పటికే.. మోకాలి గాయం కారణంగా రిషబ్ పంత్ ఆటకు దూరంగా ఉండటంతో టీమ్ మేనేజ్‌మెంట్‌లో ఆందోళన పెరిగింది. బుమ్రా వేలికి గాయమైనప్పటికీ.. మూడో రోజు లంచ్ బ్రేక్ తర్వాత బుమ్రా బౌలింగ్ చేశాడు. వేలి నుంచి రక్తం వచ్చినా.. చికిత్స అనంతరం బౌలింగ్ చేశాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 86వ ఓవర్‌లో లంచ్ తర్వాత ఫిజియో మైదానంలో కనిపించాడు. ఆ తర్వాత భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కామెంట్రీ సమయంలో ఫాస్ట్ బౌలర్ మధ్య వేలు కోసుకుపోయి రక్తస్రావం అవుతుందని చెప్పాడు. నొప్పితోనే బుమ్రా ఆ ఓవర్ పూర్తి చేశాడు. మళ్లీ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడు అతని వేలికి టేప్‌తో కనిపించింది.

Read Also: TG Government : 9 యూనివర్సిటీలకు వీసీలను నియమించిన తెలంగాణ సర్కార్‌

తొలి టెస్టు మ్యాచ్‌లో మూడో రోజైన శుక్రవారం న్యూజిలాండ్‌తో రెండో ఇన్నింగ్స్‌లో ప్రస్తుతం భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్ (35), రోహిత్ శర్మ (52) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ (19), సర్ఫరాజ్ ఖాన్ (13) పరుగులతో ఉన్నారు. 26 ఓవర్లలో 121/2 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 356 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు చేసింది.

Read Also: Supreme Court: తల్లి, భార్య, కుమార్తెను హత్య చేసిన నిందితుడు.. 12 ఏళ్ల శిక్ష తర్వాత నిర్దోషిగా ప్రకటన?