మార్కెట్ లో మల్లెపూలకు మంచి డిమాండ్ ఉంటుంది.. సమ్మర్ లో ఎక్కువగా మల్లెల వాసన మనసును దోచుకుంటుంది.. మల్లెపూల రేటు స్థిరంగా ఉండదు.. పండగలు, పెళ్లిళ్లు లాంటివి ఉంటే.. ధర కొండెక్కుతుంది. లేదంటే.. కొన్ని సార్లు రూ. 50కే కేజీ పూలు వస్తాయి. పెళ్లిళ్ల సీజన్ వస్తే ధరలకు రెక్కలు వస్తాయి.. ఒక్కోసారి కిలో రూ. 500 కూడా పలికిన రోజులు ఉంటాయి.. అయితే వీటిని తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్నారు.. ఈ పూల సాగులో ఎరువుల యాజమాన్యం చాలా ముఖ్యంగా దారిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
విడిమల్లె, దొంతమల్లె, గుండుమల్లె, బొడ్డుమల్లె అనే రకాలను రైతులు సాగు చేస్తారు.. మల్లెను కొమ్మ కత్తిరింపుల ద్వారా గానీ , అంటు మొక్కలు తొక్కటం ద్వారా గానీ ప్రవర్ధనం చేయవచ్చు. మొక్కలను తేలికపాటి నేలల్లో నాటాలి.. వీటిని జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎప్పుడైన నాటవచ్చు.. ఈ మొక్కలను గ్యాప్ ఇస్తూ నాటాలి.. ముఖ్యంగా చెప్పాలంటే సాయంత్రం నాటడం చాలా మంచిది..లేత చిగుర్ల నుండే పూలు వస్తాయి. వీటి కత్తిరింపులు తప్పనిసరిగా చేయాలి. కొమ్మ కత్తిరింపులకు 15 రోజుల ముందు నీరు కట్టడం ఆపేయాలి… కత్తిరిస్తే కొత్త మొగ్గలు ఎక్కువగా వస్తాయి..
ఎరువుల విషయానికొస్తే.. పశువుల ఎరువుతో పాటు 120 గ్రా, నత్రజని ఎరువు, 120 గ్రా భాసర్వరం , పొటాష్, ఎరువులను కొమ్మ కత్తిరింపులు చేసిన వెంటనే ఇవ్వాలి.. అలాగే పూల దిగుబడి పెంచేందుకు లీటరు నీటికి 2.5 గ్రాముల జింక్ సల్ఫేట్, 5.గ్రాముల మెగ్నీషియం, సల్ఫేట్ కలిపి రెండు, మూడు సార్లుగా మొక్కల పై పిచికారి చెయ్యాలి.. ఆరు నెలల తర్వాత పూత ప్రారంభమై మొక్క పెరిగే కొద్దీ దిగుబడి అధికమవుతుంది. ఎకరానికి సుమారు 3 నుంచి 4 టన్నుల దిగుబడి పొందొచ్చు.. ఇక పూల కోత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. ఉదయం మాత్రమే పూలను కొయ్యాలి.. అప్పుడే ఫ్రెష్ గా ఉంటాయి.. మంచి ధర పలుకుతుంది..