Underware : చాలామంది పాత వస్తువులను తొందరగా పడేయరు. ఎందుకంటే అవి సెంటిమెంట్ గా భావిస్తారు. అయితే, కొంతమందికి సెంటిమెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ సెంటిమెంట్లతో వారు ఇబ్బందుల పాలవుతూ పక్కనున్న వారికి కూడా ఇబ్బందుల పాలు చేస్తుంటారు. ఇంకొంతమంది సెంటిమెంట్ పిచ్చి పరాకాష్టకు చేరుకుంటుంది. ఈ రకం వాళ్లు దేన్నేనా సెంటిమెంటుగా అనుకుంటే ఓ పట్టాన వదిలిపెట్టరు. అవి ఆఖరికి వేసుకునే బట్టలైనా సరే.. అవి చిరిగి చింపులై పోయినా వాటిని వాడాల్సిందే. ఈ రకం సెంటిమెంట్ల విషయంలో సాధారణ ప్రజలు.. సెలెబ్రిటీలు అన్న తేడా లేదు. సెంటిమెంట్ల విషయానికి వచ్చేసరికి అందరూ మామూలు మనుషులు అయిపోతారు.
Read Also:Bilawal Bhutto: ఆర్టికల్ 370.. దావూద్ ఇబ్రహీం.. భారత్‌తో సంబంధాలపై పాక్ మంత్రి..
ప్రముఖ జపనీస్ నటుడు యూకీ కాజీ కూడా అంతే.. ఆయన ఓ డ్రాయర్ ను సెంటిమెంట్‌గా భావించారు. దీంతో దానినే దాదాపు పదేళ్ల పాటు వేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. యూకీ కాజీ తన పోస్టులో..‘‘ నేను అటాక్ ఆన్ టైటాన్స్‌కు ఓ పాత్ర చేస్తూ ఉన్నాను. కొన్ని కారణాల వల్ల ఒకే డ్రాయర్ వేసుకోవాల్సి వచ్చేది. అది కేవలం యాధృచ్చికమని నేను అనుకుంటున్నాను. నేను మొదటి ఎపిసోడ్ రికార్డు చేస్తున్నపుడు బ్లాక్ అండ్ వైట్ డ్రాయర్ వేసుకున్నాను. అది నా పనిని తెలిపే విధంగా ఉంటుందని అనుకున్నాను.రెండవ ఎపిసోడ్‌కు కూడా అదే డ్రాయర్ వేసుకున్నాను. అప్పుడు నాకు అనిపించింది. ‘అయ్యో.. గత వారమే కదా దాన్ని వేసుకున్నాను’అని. అప్పుడు నిశ్చయించుకున్నాము. దాన్నే ప్రతి ఎపిసోడ్‌కు ధరించాలని. అలా పదేళ్ల నుంచి వాడుతున్నాను. ఇప్పుడు ఒక ఎపిసోడ్ మాత్రమే ఉంది. త్వరలోరిటైర్ అయిపోతా’’ అని చెప్పాడు.
Read Also:Manhole : అయ్యో పాపం.. చూస్తుండగానే మ్యాన్ హోల్లో పడిపోయాడే