కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. వివిధ దేశాల్లో మొత్తం కలిపి 6,18,970 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒక్కరోజులో 2,125 మరణాలు సంభవించాయి. ప్రపంచలో మొత్తం కేసులు 601,189,435 చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్ వల్ల 6,475,346 మంది మరణించారు. ఆదివారం మరో 587,620 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 586,169,762కు చేరింది. జపాన్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అక్కడ కొత్తగా 1,17,130 కేసులు వెలుగుచూశాయి. మరో 284 మందికిపైగా మరణించారు.
ఇటు దక్షిణ కొరియాలోనూ కరోనా విలయతాండవం చేస్తోంది. అక్కడ తాజాగా 72,144 కరోనా కేసులు నమోదు కాగా, 64 మంది మహమ్మారి వల్ల మరణించారు. ఇటు రష్యాలో 48,042 కొత్త కేసులు, 87 మరణాలు వెలుగుచూశాయి.అమెరికా, తైవాన్, ఇటలీ, ఫ్రాన్స్, హాంకాంగ్, బ్రెజిల్లోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి.
ఇటు భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 5,910 మందికి కరోనా వైరస్ సోకింది. ఒక్కరోజులో 7,034 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.69 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసులు 0.12 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో తాజాగా మొత్తం కేసులు: 4,44,62,445, యాక్టివ్ కేసులు 53,974గా వున్నాయి. ఇటు కోవిడ్ వల్ల మొత్తం మరణాలు: 5,28,007గా వున్నాయి.
Read Also: Allari Naresh : ‘ఉగ్రం’ మొదలైంది!
కరోనా వల్ల కోలుకున్నవారు: 4,38,80,464గా వున్నారు. భారత్ లో వ్యాక్సినేషన్ యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోంది. ఆదివారం 32,31,895 కోట్ల మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 213 కోట్ల 52 లక్షలకు చేరింది. ఒక్కరోజే 2,27,313 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. బూస్టర్ డోస్ కూడా కొనసాగుతోంది. కరోనా కేసులు తగ్గినా జాగ్రత్తలు పాటించాలని వైద్యారోగ్యశాఖ ప్రజలకు సూచించింది.
Read Also: Mayor Knots MLA: మేయర్ ని పెళ్ళాడిన ఎమ్మెల్యే… స్పెషలేంటో తెలుసా?
