Site icon NTV Telugu

Japan Airlines: 36వేల నుంచి 10వేల అడుగుల ఎత్తుకు పడిపోయిన విమానం.. చివరికీ…(వీడియో)

Japan Airlines

Japan Airlines

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు కలవర పెడుతున్నాయి. తాజాగా జపాన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అసోసియేటెడ్ ప్రెస్ (AP) ప్రకారం.. జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం దాదాపు 36,000 అడుగుల ఎత్తు నుంచి అకస్మాత్తుగా కిందికి వెళ్లింది. దీంతో సిబ్బంది వెంటనే ప్రయాణికులకు ఆక్సిజన్ మాస్క్‌లు అందించారు. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

READ MORE: Dil Raju: దిల్ రాజు కాంపౌండ్ నుంచి రానున్న సినిమాలివే!

జపాన్ ఎయిర్‌లైన్స్, అనుబంధ సంస్థ స్ప్రింగ్ జపాన్ (ఫ్లైట్ JL8696/IJ004) మధ్య కోడ్‌షేర్ కింద నడుస్తున్న విమానం జూన్ 30న చైనాలోని షాంఘై పుడాంగ్ విమానాశ్రయం నుంచి జపాన్‌లోని టోక్యో నరిటా విమానాశ్రయానికి వెళుతోంది. గాలిలో 36 వేల అడుగులో ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఈ బోయింగ్ 737 విమానంలో 191 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ఈ విమానం కేవలం 10 నిమిషాల్లోనే 36,000 అడుగుల నుంచి 10,500 అడుగుల కంటే తక్కువ ఎత్తుకు పడిపోయింది. ఈ సంఘటన సమయంలో తీసిన కొన్ని వీడియోల్లో ప్రయాణికులు ఆక్సిజన్ మాస్క్‌లు పట్టుకుని కూర్చున్నట్లు కనిపించింది.

READ MORE: AR Rahman : గ్రామీ విజేతకు గ్రాండ్ వెల్‌కమ్.. రెహమాన్ స్టన్నింగ్ కామెంట్స్..!

అదృష్టవశాత్తూ అత్యవసర విమానం పూర్తిగా భూమిపైకి పడలేదు. పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని నియంత్రణలోకి తెచ్చుకున్నారు. అనంతరం ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు పరిస్థితిని వివరించి.. విమానాన్ని ఒకాసాలోని కాన్సాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి అక్కడ సేఫ్‌గా ల్యాండ్‌ చేశారు. ఈ ఘటనపై జపాన్ ఎయిర్‌లైన్స్ స్పందించింది. ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. ఈ యాంత్రిక వైఫల్యాన్ని క్షుణ్ణంగా సమీక్షిస్తామని హామీ ఇచ్చింది.

READ MORE: 17 Days In 7 Rapes: బీజేపీ పాలిత రాష్ట్రంలో 17 రోజుల్లో 7 అత్యాచారాలు.. మహిళలకు భద్రత శూన్యం!

ఈ ఘటనపై కొందరు ప్రయాణికులు మీడియాతో మాట్లాడారు. ఆక్సిజన్ మాస్క్‌లు పైకప్పు నుంచి కింద పడటంతో విమానంలో తీవ్ర భయాందోళనకు గురైనట్లు ప్రయాణీకులు వివరించారు. “నేను నిశ్శబ్దంగా బూమ్ విన్నాను. ఆక్సిజన్ మాస్క్ కొన్ని సెకన్లలో పడిపోయింది. విమానం పనిచేయడం లేదని స్టీవార్డెస్ అరిచారు. ఆక్సిజన్ మాస్క్ ధరించమని హెచ్చరించాడు.” అని ఓ ప్రయాణికుడు తెలిపారు. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న మరో ప్రయాణికుడు మాట్లాడుతూ.. “నేను నిద్రపోతున్నాను. అకస్మాత్తుగా, ఆక్సిజన్ మాస్క్‌లన్నీ తెరుచుకున్నాయి. అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గుర్యయ్యారు” అని తెలిపారు.

Exit mobile version