Jani Master Case: జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్
- జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్
- ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందుకు జానీ భార్య
- జానీ మాస్టర్‌పై ఆరోపణలు చేసిన మహిళపై ఫిల్మ్ ఛాంబర్‌లో ఇటీవల ఫిర్యాదు
- ఆధారాలు సమర్పించిన సుమలత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. జానీ మాస్టర్ సతీమణి సుమలత.. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందు హాజరైంది. ఇటీవల జానీ మాస్టర్‌పై ఆరోపణలు చేసిన మహిళపై ఫిల్మ్ ఛాంబర్ లో సుమలత ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదు నేపథ్యంలో సుమలతను ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వివరణ కోరింది. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ ముందు హాజరైన సుమలత.. మహిళా కోరియోగ్రాఫర్ చేస్తున్న ఆరోపణలు ఖండించింది. మహిళా కొరియోగ్రాఫర్ కు సంబంధించిన అన్ని ఆధారాలను ఫిల్మ్ ఛాంబర్ కమిటీకి అందించింది. తన భర్త జానీపై లేని పోని ఆరోపణలు చేసిన మహిళా కొరియోగ్రాఫర్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఆమె దగ్గర నుంచి వివరాలు తీసుకున్నారు.. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ సభ్యులు. మరో వైపు రేపు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ రంగారెడ్డి కోర్టు తీర్పు వెలువరించనుంది.
READ MORE: Pemmasani Chandrasekhar: గుంటూరు నగరాన్ని క్లీన్సిటీగా చేసేందుకు కృషి చేయాలి..
Also Read
తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని జానీ మాస్టర్ భార్య అయేషా అలియాస్ సుమలత ఇటీవల అన్నారు. కావాలనే ఆ అమ్మాయి ఈ ఆరోపణలు చేసిందని ఆమె పేర్కొన్నారు. ఆమె ఏం కావాలని ఆశిస్తుందో తెలియదని.. అంతా దేవుడికి తెలుసన్నారు. పెద్ద ఆరోపణలు చేశారని.. ఇదంతా కోర్టులోనే తేల్చుకుంటామన్నారు. జానీ మాస్టర్ నిజం ఒప్పుకున్నారని మీడియాలో థంబ్‌నెయిల్స్ పెడుతున్నారని, అదంతా అవాస్తవమని కొట్టిపడేశారు. ఆ అమ్మాయి అలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి శిష్యురాలిగా ఉన్న అమ్మాయి లైంగిక ఆరోపణలు చేస్తే ఎవరైనా ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ఇంటర్వ్యూలలో జానీ మాస్టర్ గురువుగా దొరకడం అదృష్టమని చెప్తున్న ఆ అమ్మాయి.. మళ్లీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చెప్తోందని.. ఏది నమ్మాలని ఆమె ప్రశ్నించారు. ఆ అమ్మాయి ఇంటర్వ్యూ వీడియోల్లో చూస్తే.. ఆమె తప్పుడు ఆరోపణలు చేసిందని క్లియర్‌గా అర్థమవుతోందన్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!