NTV Telugu Site icon

Janhvi Kapoor Tamil Debut: జాన్వీ కపూర్‌కి గోల్డెన్‌ చాన్స్‌.. కోలీవుడ్‌ యువ హీరోతో సినిమా! నిర్మాత కమల్

Janhvi Kapoor Cover

Janhvi Kapoor Cover

Janhvi Kapoor to Act with Praddep Ranganathan in Tamil: అతిలోక సుందరి శ్రీదేవి తనయగా జాన్వీ కపూర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమా ‘ధడక్’ హిట్ కావడంతో జాన్వీకి వరుస ఆఫర్లు వచ్చాయి. దోస్తానా 2, హెలెన్, గుడ్ లక్ జెర్రీ, మిస్టర్ అండ్ మిసెస్ మహీ, మిలి, రూహి, గుంజన్ సక్సేనా సినిమాలు చేశారు. జాన్వీ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్‌లో బిజీబిజీగా ఉన్నారు. నటన కంటే తన అందాలతోనే సోషల్‌ మీడియాను ఆమె షేక్ చేస్తున్నారు. నెట్టింట ఆమె పోస్టులకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.

బాలీవుడ్‌లో ఇప్పటికే సూపర్ క్రేజ్ సంపాదించుకున్న జాన్వీ కపూర్.. దక్షిణాది సినిమాలపై దృష్టి పెట్టారు. దక్షిణాది చిత్రాల్లో నటించాలన్న కోరిక తనకు ఉందని గతంలో చెప్పిన జాన్వీ.. తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ఇది దక్షిణాదిలో జాన్వీ తన రెండవ చిత్రాన్ని చేయనున్నారని సమాచారం. కోలీవుడ్‌లో ఆమె అరంగేట్రం చేస్తున్నారట.

Also Read: Asian Games 2023 BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఏషియన్ గేమ్స్ 2023లో టీమిండియా!

జాన్వీ కపూర్‌ను సీనియర్ హీరో కమలహాసన్‌ కోలీవుడ్‌లో పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. ‘లవ్‌ టుడే’ సినిమా డైరెక్టర్ కమ్ హీరో ప్రదీప్‌ రంగనాథం కథానాయకుడిగా.. విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో నిర్మాతగా కమలహాసన్‌ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రంలోనే జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా తీసుకుంటున్నారట. ఇందుకు సంబంధించి చర్చలు కూడా కమల్ జరుపుతున్నట్లు తెలిసింది. ఇందులో కమలహాసన్‌ ఒక కీలక పాత్ర చేయనున్నట్లు సమచారం.

‘విక్రమ్‌’ సినిమాతో కమలహాసన్‌ బంపర్‌ హిట్‌ కొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన 233వ చిత్రంలో నటించడానికి ఆయన సిద్ధమవుతున్నారు. హెచ్‌ వినోద్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌న్స్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు కమల్ వరుసగా చిత్రాలు కూడా నిర్మిస్తున్నారు. స్టార్ హీరోలు శింబు, శివకార్తికేయన్‌లతో ఆయన సినిమాలు చేస్తున్నారు. ప్రదీప్‌ రంగనాథంతో మరో సినిమా కూడా లైన్‌లో పెట్టారు.

Also Read: Ben Stokes Record: బెన్ స్టోక్స్‌ అరుదైన రికార్డు.. దిగ్గజాల సరసన చోటు!

Show comments