Site icon NTV Telugu

Janhvi Kapoor : ‘అమ్మ నన్ను పట్టుకుంది, ఏడుస్తోంది కానీ..’, జాన్వీ నోటివెంట శ్రీదేవి చివరి మాటలు

Actrees Shridevi

Actrees Shridevi

Janhvi Kapoor : దివంగత నటి శ్రీదేవి, ఆమె ఇద్దరు కుమార్తెలు జాన్వీ, ఖుషి నిర్మాత బోనీ కపూర్‌లకు రెండవ కుటుంబం ఉంది. బోనీ కపూర్ మొదటి భార్య మోనా శౌరీ కపూర్. వీరికి ఇద్దరు పిల్లలు. నటులు అర్జున్ కపూర్, అన్షులా కపూర్… బోనీ కపూర్ .. శ్రీదేవి ని పెళ్లి చేసుకునేందుకు అర్జున్ కపూర్‌ అంగీకరించలేదు. కానీ శ్రీదేవి మరణ వార్త తెలియగానే అర్జున్ కపూర్ తన చెల్లెళ్లు జాన్వీ, ఖుషీలకు అండగా నిలిచాడు. శ్రీదేవి 2018లో దుబాయ్‌లో తుది శ్వాస విడిచారు. కానీ జీవితంలో తల్లి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయరు.. ఇది కూడా నిజం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, జాన్వీ తన తల్లి చివరి మాటలు.. ఆమె కుటుంబం గురించి సంచలన విషయాలు వెల్లడించింది.

Read Also:No Leave in 74 Years: సూపర్ వుమెన్.. ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా 74 ఏళ్ల పాటు డ్యూటీ!

శ్రీదేవి దుబాయ్ వెళ్ళినప్పుడు ఆమె తన తల్లితో చివరిగా మాట్లాడిందని జాన్వీ చెప్పారు. ఆ సమయంలో జాన్వీ తన మొదటి సినిమా ‘ధడక్’ షూటింగ్‌లో ఉంది. షూటింగ్‌లో బిజీగా ఉన్న జాన్వీకి తన తల్లితో సమయం గడపడం లేదు. జాన్వీ తన తల్లి దుబాయ్‌కు వెళ్లడంతో ఒకరోజు ముందుగానే శ్రీదేవి గదికి వెళ్లింది. అయితే తన తల్లి ప్యాకింగ్‌లో బిజీగా ఉండటం చూసి జాన్వీ తన గదికి తిరిగి వచ్చింది. అయితే శ్రీదేవి అన్ని పనులు ముగించుకుని జాన్వీ గదికి వచ్చింది.

Read Also:Hair Oil: ఈ నూనెతో మసాజ్ చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది

తన తల్లితో గడిపిన చివరి క్షణాల గురించి జాన్వీ మాట్లాడుతూ.. ‘అమ్మ దుబాయ్‌కి వెళ్లడంతో బిజీగా ఉంది. షూటింగ్‌తో అలసిపోయాను. అప్పుడు నేను అమ్మకి చెప్పాను నాకు నిద్ర వస్తోంది.. అమ్మ నా గదిలోకి వచ్చినప్పుడు నేను నిద్రపోతున్నాను .. కానీ అమ్మ అక్కడ ఉందని నాకు తెలుసు’. ఆ రోజు పనులన్నీ ముగించుకుని నా దగ్గరకు వచ్చింది. ఆమె నన్ను దగ్గరగా పట్టుకుని, నా తలపై చేతులు వేసింది.’ శ్రీదేవితో జాన్వీ గడిపినవి ఇవే చివరి క్షణాలు. జాన్వీ ఇంకా మాట్లాడుతూ.. ‘తల్లి మరణం తర్వాత కుటుంబమంతా ఒక్కటైంది. కష్ట సమయాల్లో కుటుంబం కలిసి వచ్చి ఆదుకుంది. నేను మా అమ్మను పోగొట్టుకున్నాను.. ఆ లోటు ఎవరు తీర్చలేరు. అంటూ బాధాతప్త హృదయంతో కంట తడిపెట్టుకుంది.

Exit mobile version