బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది.. త్వరలోనే సినిమా విడుదల కాబోతుంది.. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తమిళ్ డైరెక్టర్ తో కలిసి జాన్వీ పూజలు చేసిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..
ధడక్ తో తెరంగేట్రం చేసి తొలి తోనే నటిగా ప్రశంసలు అందుకుంది.ఆ తర్వాత విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తుంది.. లేడీ ఓరియెంటెడ్ కథలను ఎంచుకుంటూ కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.. ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న దేవర చిత్రంలో జాన్వీ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇందులో తంగం పాత్రలో కనిపించనుంది జాన్వీ. ఇటు తెలుగు, అటు హిందీ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న జాన్వీకి దైవ భక్తి కూడా ఎక్కువే. సమయం దొరికినప్పుడల్లా.. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటుంది జాన్వీ.. ఇప్పటికే ఎన్నో ప్రముఖ ఆలయాలను సందర్శించింది..
తాజాగా ఉజ్జయినిలోని మహా కాళేశ్వరాలయానికి వెళ్లింది. తన ప్రియుడు శిఖర్ బహారియాతో కలిసి జాన్వీ మహా కాలేశ్వర్ స్వామిని దర్శించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఆమెతోపాటు.. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, అతని భార్య ప్రియ సైతం ఆ ఫోటోలలో కనిపిస్తున్నారు. దీంతో వీరంతా కలిసి వెళ్లారా ? లేదా అక్కడ అనుహ్యంగా కలిశారా ?అనేది తెలియరాలేదు.. కానీ ఈ ఫోటోలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి..