Janvi Kapoor : కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ దేవర. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై కొసరాజు హరికృష్ణ, సుధాకర్ మిక్కిలినేని నిర్మించారు. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవర సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. తొలిరోజు కలెక్షన్లు దిమ్మతిరిగేలా ఉన్నాయని టాక్. బాక్సాఫీసు వద్ద దేవర కలెక్షన్ల ఊచకోత సృష్టించినట్లు తెలుస్తోంది. తొలిరోజే రూ.172కోట్లు కొల్లగొట్టి తన స్టామినా ఏంటో ఎన్టీఆర్ మరో సారి నిరూపించాడు. ఈ సినిమా మిక్స్‌డ్ రివ్యూలను అందుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా డే 1 వసూళ్లలో టాప్ గా నిలిచింది.
Read Also:Devara : రెండు రోజుల నైజాం, నార్త్ అమెరికా సేల్స్.. దేవర అన్ స్టాపబుల్..
ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అయితే, ఎన్నో అంచనాలతో హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ పాత్ర పై మాత్రం అభిమానులు కాస్త నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఆమె నటనకు కూడా అదే టాక్ ఉంది. నిజానికి ‘దేవర 1’లో తంగం పాత్ర తేలిపోయిందని అంటున్నారు. జాన్వీ ఒక్క చుట్టమల్లే సాంగ్ లో తప్పిస్తే మిగతా అంతా 10నిమిషాలు ఎటు పోయిందని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాలో జాన్వీది అతిథి పాత్రా అన్న అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాన్వీ ఫ్యాన్స్ కి ఆమె కొత్త తెలుగు సినిమా పై ఫోకస్ పడింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఓ భారీ చిత్రం చేయబోతున్నారు. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తుంది. దేవర సినిమాలో జాన్వీ కపూర్ కి పెద్దగా స్క్రీన్ టైం లేదు. పైగా ఉన్న సీన్స్ లో కూడా ఆమె నటన ఎలివేట్ కాలేదు. ఆమె గ్లామర్ కు తప్పించి.. నటనకు పెద్దగా స్కోప్ రాలేదు కాబట్టి, జాన్వీ కపూర్ ఇక చరణ్ సినిమా పైనే ఆశలు పెట్టుకోవడం మంచిదని అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు. పాపం జాన్వీ కపూర్, తన టాలీవుడ్ డెబ్యూ కోసం ఎంతగానో ఎదురు చూసింది. ఇప్పుడు, మళ్లీ చరణ్ సినిమా కోసం కూడా అంతకన్నా ఎక్కువగా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
Read Also:Tamilnadu: భారీ వర్షాలు.. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!