Janhvi Kapoor : వేడుకలో జిప్ చిరిగిపోయి ఇబ్బందిపడ్డారట జాన్వీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్.. ప్రస్తుతం బాలీవుడ్లో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే ఆర్ఆర్ఆర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ ఎన్టీఆర్30లో ఛాన్స్ కొట్టేసిన భామ కూడా రీసెంట్ గా షూటింగ్ లో పాల్గొంది. కాగా, 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ కార్యక్రమం గురువారం రాత్రి ముంబైలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో వైలెట్ కలర్ గౌనులో దేవదూతలా కనిపించింది. జాన్వీ తన స్టేజ్ పెర్ఫార్మెన్స్తో కూడా ఆకట్టుకుంది. అదే సమయంలో, ఆమె ధరించిన దుస్తుల జిప్ చిరిగిపోయిందని అందుకు సంబంధిత చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేడుకలో ప్రదర్శనకు ముందు జాన్వీ తాను ఇబ్బంది పడ్డానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను షేర్ చేసింది. తన డ్రెస్ జిప్ రెండుసార్లు చిరిగిపోయిందని వెల్లడించింది. ఆ డ్రెస్ తో రెడ్ కార్పెట్ పై నడిచే 5 నిమిషాల ముందు జిప్ చిరిగిపోయిందని, ఆ తరువాత స్టేజి పై పెర్ఫామెన్స్ ఇచ్చే 12 నిమిషాల ముందు జిప్ మళ్ళీ చిరిగినట్లు జాన్వీ తెలియజేసింది. ఈ విషయాన్ని చెప్పుకొస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫొటోలో జాన్వి కారులో కూర్చొని ఉంటే టైలర్ వెనుక నుంచి ఆ జిప్ ని కుడుతూ ఉండడం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read
- Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
- ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
- US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
Read Also: Telugu Sangamam: కాశీలో తెలుగు భక్తుల సంగమం.. ప్రసంగించనున్న ప్రధాని
ఇదిలా ఉంటే, ‘మిలి’ చిత్రంలో తన నటనకు గాను జాన్వీ ఈ సంవత్సరం ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ నటి (మహిళ) విభాగంలో నామినేట్ చేయబడింది. కానీ సంజయ్ లీలా భన్సాలీ ‘గంగూబాయి కతియావాడి’లో తన నటనకు అలియా భట్ ఈ అవార్డును గెలుచుకుంది. గతంలో కూడా 2020లో ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ సినిమా కోసం జాన్వీ ఫిల్మ్‌ఫేర్‌కు నామినేట్ కావడం.. ఇది రెండోసారి.
గతేడాది ‘గుడ్ లక్ జెర్రీ, మైలీ’ సినిమాల్లో కనిపించిన జాన్వీ ఇప్పుడు ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’లో క్రికెటర్‌గా కనిపించనుంది. ఈ చిత్రంలో ఆమె రాజ్‌కుమార్‌రావుతో జతకట్టనుంది. ఆమె నితేష్ తివారీ ‘బావల్’లో వరుణ్ ధావన్ సరసన కూడా నటిస్తోంది. కాగా, కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 చిత్రం ద్వారా జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనున్నారు.
తాజావార్తలు
-
AB de Villiers: వైభవ్‌ను ఆ ఆస్ట్రేలియా దిగ్గజంతో పోల్చిన డివిలియర్స్.. బుడ్డోడి మెచ్యూరిటీపై ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
-
ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
-
Abhishek Sharma: ఒత్తిడిని తట్టుకోలేకపోతున్న అభిషేక్ శర్మ.. కీలక మ్యాచ్‌ల్లో చేతులెత్తేస్తున్న కాటేరమ్మ కొడుకు!
-
US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..