NTV Telugu Site icon

Jangaon District: రూ.300ల కోసం హత్య.. బండరాయితో కొట్టి నిప్పంటించిన స్నేహితులు

Murder

Murder

జనగామ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.. జిల్లా కేంద్రంలోని వినాయక బార్ వెనుకాల ఓ వ్యక్తిని స్నేహితులు బండ రాయితో కొట్టి నిప్పంటించారు. మృతుడు జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో జీవనం కొనసాగిస్తున్న వెంకన్నగా పోలీసులు గుర్తించారు. అతడు తన వెంట ఓ కోతిని పెట్టుకుని జీవిస్తున్నట్లు తెలిపారు. వెంకన్నను స్నేహితులు మూడు వందల రూపాయలు అడిగారు. ఇవ్వకపోవడంతో వెంకన్న,స్నేహితుల మధ్య వాగ్వాదం జరిగింది. ఘర్షణ ముదరడంతో వెంకన్నను స్నేహితులు హత్య చేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. కేవలం మూడు వందల రూపాయల కోసం హత్య జరగడం జిల్లాలో కలకలం రేపుతుంది.

READ MORE: Bhogi 2025: లక్ష 116 పిడకలను తయారు చేసిన మహిళ.. చూసేందుకు క్యూ కడుతున్న జనాలు!

Show comments