మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు జంగయ్య యాదవ్(వజ్రేష్ యాదవ్) హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాట్లాడుతూ ఈసారి మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్ జంగయ్య యాదవ్(వజ్రేష్ యాదవ్) కే వస్తుందని కావున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. రాబోయే 50 రోజులు కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని కోరారు.
Also Read : Rainy Season : అధిక వర్షాల నుంచి పండ్ల తోటలను ఎలా కాపాడాలి?
ఈ సందర్భంగా జంగయ్య యాదవ్ మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా, జిల్లా మంత్రిగా ఉంది మేడ్చల్ జిల్లాకు చేసిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు. దళితుల భూములు లాక్కోవాలని చూస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మంత్రి మల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ల దగ్గర కోట్లాది రూపాయలను వసూలు చేశాడని ఆరోపించారు. ఇన్ని రోజులు ఏమీ చేయలేని నువ్వు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా అభివృద్ధి ఏమి చేస్తావు, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎలా ఇస్తావని అన్నారు. మంత్రి మల్లారెడ్డి ఒక్క మున్సిపాలిటీలోనైనా ఒక్క ఆసుపత్రి ఏర్పాటు చేయలేదన్నారు. నిన్న ప్రజలకు ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వకుండా వెదవ మాటలు చెప్పి వెళ్లిపోయాడని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మంత్రి మల్లారెడ్డి అవినీతిని బట్టబయలు చేస్తామన్నారు. మల్లారెడ్డి అవినీతికి భూములు కబ్జా, కళాశాలలు కబ్జాలు సరిపోలేదన్నారు.
Also Read : Mynampally Hanumanth Rao : ప్రభుత్వంది ఒంటెద్దు పోకడ.. మహిళ నాయకులకు రాత్రివేళ ఫోన్లు చేస్తూ