Nadendla Manohar: జగన్ క్లియరెన్స్ సేల్స్ మొదలు పెట్టారు.. జనసేన ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar: సీఎం వైఎస్ జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. గత నెల నవంబర్మూడో తేదీన జరిగిన కేబినెట్ భేటీలో కొన్ని కంపెనీలకు విచిత్రమైన ప్యాకేజీలు ప్రకటించారు. దుకాణం మూసేసే ముందు క్లియరెన్స్ సేల్స్ పెట్టినట్టు.. వైఎస్ జగన్ కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల పేరుతో జగన్ క్లియరెన్స్ సేల్స్ మొదలు పెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టును మేం కట్టలేమని అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్ సంస్థ ప్రతినిధులు లేఖ రాశారు. 2600 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పజెప్పేస్తామని అనిల్ అంబానీ సంస్థ చెప్పేసింది. కానీ, సడెన్‌గా అదే అనిల్ అంబానీ సంస్థకు ఆ భూములని కట్టబెట్టారు. ఏం క్విడ్ ప్రో కో జరిగిందని ఈ భూములను తిరిగి అనిల్ అంబానీకి కట్టబెట్టారు..? అని ప్రశ్నించారు.
Read Also: Most Viral Videos 2023 : 2023 లో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయిన వీడియోలు ఇవే..
Also Read
- OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
- 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
ఇక, నియోజన్ ప్రాపర్టీ సంస్థ అపెరల్ పార్కు ఏర్పాటు చేస్తామంటే సుమారు 300 ఎకరాల్లో వైఎస్ భూములు కేటాయించారు అని గుర్తుచేశారు నాదెండ్ల.. ఈ భూములు తిరిగి ఇచ్చేయమని వైఎస్ జగన్ వెంటపడ్డారు.. వాళ్లు కోర్టుకెళ్లారు. అపెరల్ పార్క్‌గా కాకుండా ఇతర జనరల్ ఇంజనీరింగ్ అవసరాల కోసం కేటాయించాలని అదే సంస్థ కోరింది. అపెరల్ పార్క్ అయితే చాలా మంది మహిళలకు ఉపాధి లభించేది. జనరల్ ఇంజనీరింగ్ అనే పేరుతో భూములు కేటాయించడం వల్ల ఉపాధి అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, జగన్ అవేవీ పట్టించుకోకుండా భూములను కట్టబెట్టేస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఐపీసీ ఒప్పుకోకున్నా.. తిరస్కరించినా.. సీఎం నేతృత్వంలోని ఎస్ఐపీబీ మాత్రం ఆమోదించింది. అప్పటి భూమి విలువ ఎంతుంది..? ఇప్పుడు భూముల విలువ ఎంతుంది..? ఈ రెండు సంస్థలకు భూములను అప్పగిస్తూ సేల్ డీడ్ చేయడం వెనుకున్న మతలబేంటీ..? అని నిలదీశారు.. ఇదే సమయంలో మేం ప్రభుత్వంలోకి రాగానే వీటిని పరిశీలిస్తాం అని ప్రకటించారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని సీఎం వైఎస్ జగన్ చెప్పుకుంటూ వచ్చారు. పరిశ్రమల కోసం వైఎస్ నాడు ఎస్ఈజెడ్ లు ఏర్పాటు చేశారు. పెట్టుబడులను వైఎస్సార్ ప్రొత్సహించారు. కానీ, వైఎస్ తనయుడైన జగన్ ఆ భూముల విషయంలో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.
తాజావార్తలు
-
OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
-
Yash Toxic: యష్‌కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
Producer Deepti: హీరోయిన్‌పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
ట్రెండింగ్
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?