Janasena Meeting: నేడు జనసేన కీలక సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ కళ్యాణ్ భేటీ
- నేడు జనసేన పార్టీ కీలక సమావేశం
- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ కళ్యాణ్ సమావేశం
- పార్టీ అంతర్గత కమిటీల నియామకం ప్రధాన అజెండా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘జనసేన’ పార్టీ నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై పలు ముఖ్య అంశాలపై చర్చించనున్నారు. విజయవాడలోని నోవోటల్ హోటల్‌లో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పార్టీ అంతర్గత కమిటీల నియామకం ప్రధాన అజెండాగా ఉండనుంది. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై సమగ్రంగా చర్చించి నేతలకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
అదేవిధంగా ఎమ్మెల్యేలకు అదనపు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించే అంశంపైనా సమావేశంలో చర్చ జరగనుంది. పార్టీ పనితీరును మెరుగుపరచడం, స్థానిక స్థాయిలో పార్టీ చురుకుదనాన్ని పెంచడం లక్ష్యంగా నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. పార్టీ క్రమశిక్షణను కట్టుదిట్టం చేసేందుకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి), క్రమశిక్షణ కమిటీలు ఏర్పాటు చేసే అంశంపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కూడా సమావేశంలో సమీక్ష జరగనుంది.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
Also Read: IPL 2026 vs Peddi: ఐపీఎల్ ఫీవర్ మధ్య రిలీజ్.. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకి అసలైన పరీక్ష తప్పదా?
ప్రస్తుతం జనసేన పార్టీకి సుమారు 15 లక్షల మంది సభ్యత్వం ఉన్నట్లు సమాచారం. నేటితో సభ్యత్వ నమోదు గడువు ముగియనుండగా.. దాన్ని మరో మూడు రోజుల పాటు పొడిగించే యోచనలో జనసేన పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం ద్వారా మరింత మంది సభ్యులను ఆకర్షించాలని నాయకత్వం భావిస్తోంది. మొత్తంగా ఈ సమావేశం జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణకు కీలకంగా మారనుంది. పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు పార్టీ దిశను నిర్ణయించనున్నాయి.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!