IPL 2026 vs Peddi: ఐపీఎల్ ఫీవర్ మధ్య రిలీజ్.. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకి అసలైన పరీక్ష తప్పదా?
- మార్చి 28న ఐపీఎల్ 2026 ప్రారంభం
- ఏప్రిల్ 30న రిలీజ్‌కు సిద్ధమవుతున్న పెద్ది
- పెద్ది రిలీజ్ సమయానికి పీక్‌లో ఐపీఎల్
- రామ్ చరణ్‌కి అసలైన పరీక్ష తప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026 vs Peddi: వేసవి సీజన్ అంటే సినిమాలకు మంచి సువర్ణావకాశం. ఎన్నో ఏళ్లుగా సమ్మర్ హాలిడేస్‌ను చాలా సినిమాలు టార్గెట్ చేస్తూ వచ్చాయి. అయితే కొన్నేళ్లుగా ఇదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా ప్రారంభం కావడంతో.. థియేటర్లపై పెను ప్రభావం పడుతోంది. సినిమాలకు ఇదేమీ కొత్త విషయం కాదు. అయితే ఏప్రిల్ 30న రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా నిలబడుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
ఐపీఎల్ 2026 మార్చి 28న ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ చివరి వారానికి వచ్చే సరికి ఐపీఎల్ పీక్‌లో ఉంటుంది. టాప్-4లో చోటు కోసం అన్ని టీమ్స్ గట్టిగా పోటీపడుతాయి. దాంతో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతుంటాయి. ఆ సమయంలో క్రికెట్ అభిమానులు ఎక్కువగా మ్యాచ్‌లకే ప్రాధాన్యం ఇస్తారు. ఈ నేపథ్యంలో నైట్ షోస్‌కు థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గిపోతుంది. గతంలో కూడా ఐపీఎల్ ప్రభావం సినిమాల కలెక్షన్లపై స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో ‘పెద్ది’ వంటి బిగ్ సినిమా విడుదల అవ్వడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
స్టార్ కాస్ట్, భారీ అంచనాలు ఉన్న సినిమాలపై కూడా ఐపీఎల్ ఎఫెక్ట్ భారీగా పడింది. మరి రామ్ చరణ్ ‘పెద్ది’పై ఎంతవరకు ప్రభావం ఉంటుందన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ముఖ్యంగా వీకెండ్ కాకుండా వర్కింగ్ డేస్‌లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశముంది. పెద్ది సినిమాను బాక్సాఫీస్‌కు పరీక్షలా ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఐపీఎల్ ఫీవర్ మధ్య కూడా.. ప్రేక్షకులను పెద్ది మూవీ థియేటర్లకు రప్పించగలదా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మంచి టాక్ వస్తే.. ఐపీఎల్ ప్రభావాన్ని తట్టుకుని మంచి కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. లేదంటే పెద్దిపై ప్రభావం పడటం ఖాయం. ఇప్పటికే ‘గేమ్ ఛేంజర్’తో చరణ్ భారీ ప్లాఫ్ అందుకున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!