Site icon NTV Telugu

Nadendla Manohar: రాష్ట్రానికి మేలు జరిగే విధంగా పొత్తులు

Manohar

Manohar

Nadendla Manohar: రాష్ట్రంలో జరుగుతున్న దాష్టికాలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పని చేస్తామని జనసేన పీఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రానికి మేలు జరిగే విధంగా పొత్తులు ఉంటాయన్నారు. బీజేపీ ముఖ్య నాయకులు, చంద్రబాబుతో పొత్తులపై చర్చలు జరిపామన్నారు. సీట్ల గురించి చర్చలు జరగలేదన్నారు. పవన్ కల్యాణ్ తీసుకునే నిర్ణయంపై పార్టీ నాయకులు అందరూ కట్టుబడి ఉంటారన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని.. అధికారంలోకి రాక ముందు ఒక మాట వచ్చిన తరువాత మరో మాట జనసేన మాట్లాడదన్నారు. వైవీ సుబ్బారెడ్డి సొంత జిల్లా గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వైవీ సుబ్బారెడ్డి రైతుల కోసం పాదయాత్ర చెయ్యాలని సవాల్ చేస్తున్నామన్నారు. చిత్తశుద్ధి ఎవరికి ఉందో ప్రజలు ఆలోచించాలన్నారు.

Read Also: Perni Nani: టీడీపీ కోసమే పవన్‌ పార్టీ పెట్టారు.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

వ్యవసాయ శాఖ మంత్రి తన జేబులో నుంచి రైతుల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చెయ్యలేదన్నారు. దర్శి నియోజకవర్గంలో ఆర్థిక ఇబ్బందులతో వైసీపీ సర్పంచ్ ధనలక్ష్మి ఆత్మహత్య చేసుకుందన్నారు. ఒక డీఎస్పీ ట్రాన్స్‌ఫర్‌, ఫ్లెక్సీల గురించి రాజకీయాలు చేస్తున్నారని.. గ్రానైట్ క్వారీల్లో పర్సంటేజ్‌లు తీసుకుని నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. బటన్ నొక్కే కార్యక్రమం వల్ల రాష్ట్రంలో ఎంత మందికి లబ్ధి చేకూరిందని ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీ బకాయిలు 1000 కోట్లు ఉంటే…100కోట్లు ఇచ్చారని.. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అందకారంలోకి తీసుకెళ్లిందని విమర్శించారు.

Exit mobile version