Site icon NTV Telugu

TDP, Janasena and BJP Alliance: ఢిల్లీకి పవన్ కళ్యాణ్..? పొత్తులపై త్వరలో రానున్న క్లారిటీ..!

Janasena

Janasena

TDP, Janasena and BJP Alliance: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అందులో భాగంగా త్వరలోనే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీకి వెళ్లనున్నారు.. పొత్తుల విషయంలో బీజేపీతో క్లారిటీ తీసుకోనున్నారు. పొత్తులపై బీజేపీ అధిష్టానంతో మంతనాలు జరపనున్నారు.. ఇక, పవన్‌ కల్యాణ్‌తో భేటీ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.. ఏదేమైనా వీలైనంత త్వరలోనే పొత్తులపై టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు.. ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందంటున్నారు.. అయితే, ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా పొత్తులపై క్లారిటీకి వచ్చేయాలని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారట.

Read Also: Gunturu Kaaram : గుంటూరు కారం నుంచి ‘అమ్మ’ ఎమోషనల్ సాంగ్ రిలీజ్…

కాగా, ఏపీలో బీజేపీ-జనసేన పొత్తులో ఉండగా.. ఆ మధ్యే తెలుగుదేశం పార్టీతో జత కట్టాలని జనసేన నిర్ణయానికి వచ్చింది. కానీ, టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కలిసి వస్తుందా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు. ఇదే సమయంలో.. జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఉందని ఇరు పార్టీల నేతలు చెబుతూ వస్తున్నారు.. కానీ, టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై క్లారిటీ లేదు.. ఇక, ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో.. మూడు పార్టీల పొత్తుపై ఓ నిర్ణయానికి వచ్చే దశగా చర్చలు సాగుతున్నాయి. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై జరుగుతోన్న ప్రచారంపై విశ్లేషణ కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..

Exit mobile version