NTV Telugu Site icon

Pawan Kalyan: ప్రధాని మోడీ నామినేషన్‌కు జనసేనాని

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జనంతో పాటు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, పలువురు వ్యాపారవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు ఓటేశారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ కూడా మంగళగిరిలో తన భార్యతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా.. ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. మరో వైపు ఎన్నికల ముందు జనసేన, టీడీపీ కలిసి బీజేపీతో జతకట్టిన విషయం తెలిసిందే. ఈక్రమంలో కూటమి ప్రచారానికి ప్రధాని మోడీ పలు సార్లు రాష్ట్రానికి విచ్చేసి ఎన్డీయే కూటమిలో జోష్ నింపారు. చివరగా విజయవాడలో జనసేన అధినేత పవన్‌, టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి రోడ్‌ షో నిర్వహించారు.

Read Also: Sajjala Ramakrishna Reddy: ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా కనిపిస్తోంది.. అంతిమ విజయం ప్రజలదే..

కాగా.. రేపు వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే వారణాసి చేరుకున్న ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అసలు విషయమేమిటంటే.. ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఆయన వారణాసి బయలుదేరి వెళ్లారు. ఈ రోజు రాత్రి అక్కడే ఉండి.. రేపు ఉదయం ప్రధాని మోడీ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పవన్‌తో పాటు పలువురు కీలక నేతలు పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

 

Show comments