NTV Telugu Site icon

Pawan Kalyan: జనసేన, టీడీపీ సారధ్యంలో ‘గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది’.. పవన్‌ ట్వీట్

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీలు ఐక్యంగా ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి సిద్ధం అవుతున్నాయి. అందులో భాగంగా టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి పోరాటానికి దిగాయి. తొలిగా రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై శని, ఆదివారాల్లో రెండ్రోజులపాటు ఆందోళన చేపట్టాలని నిర్ణయించాయి.. ఇందులో భాగంగా ధ్వంసమైన రోడ్ల వద్దకు వెళ్లి నిరసనలు తెలపడం, ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించడం, అధికారులకు రోడ్ల దుస్థితిపై వినతి పత్రాలు అందించాలని ఉభయపార్టీలు నిర్ణయించాయి.

Also Read: Adimulapu Suresh: చంద్రబాబు బీసీలను 14 ఏళ్లు మోసం చేశారు..

18,19 తేదీలలో రోడ్ల దుస్థితిపై ఆందోళనలు చేపట్టనున్న టీడీపీ – జనసేన జేఏసీ.. “గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేదీ” పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. రెండు పార్టీల శ్రేణులు ఐకమత్యంతో కలిసి పనిచేసేలా ఉమ్మడి ఆందోళనలకు నాయకత్వాలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రజా సమస్యలపై ఉమ్మడిగా కదిలితే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని ఈ ఆలోచన చేశామని, వరుస క్రమంలో వివిధ సమస్యలపై ఆందోళనలు చేపడతామని ఆయా పార్టీల వర్గాలు తెలిపాయి. గుంతలు పడ్డ రోడ్లు.. ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రజలు పడుతోన్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ సోషల్ మీడియా క్యాంపెయిన్‌ కూడా చేయాలని నిర్ణయించారు.. #GunthalaRajyamAP, #WhyAPHatesJagan హ్యాష్ ట్యాగులతో సోషల్ మీడియా వేదికగా టీడీపీ – జనసేన ప్రచారం చేయనుంది.. కాగా, ఇప్పటికే రాష్ట్రస్థాయి ఉమ్మడి సమావేశాలతో పాటు.. నియోజకవర్గాల స్థాయిలోనూ టీడీపీ-జనసేన పార్టీలు ఉమ్మడి సమావేశాలు నిర్వహించి ప్రజాపోరాటాలపై నిర్ణయం తీసుకుంది.

Also Read: Purandeshwari: అమరావతి రాజధాని అని బీజేపీ కట్టుబడి ఉంది..

ఇదిలా ఉండగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ట్విట్టర్‌ వేదికగా “గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేదీ” కార్యక్రమాల గురించి పోస్ట్ చేశారు. జనసేన, టీడీపీ పార్టీల ఉమ్మడి సారథ్యంలో “గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేదీ” కార్యక్రమం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ట్విట్టర్‌ పోస్ట్‌లో “జనసేన, టీడీపీ నేతలు కార్యకర్తల్లారా! గుంతల రోడ్లతో ఎన్నాళ్లు మనకు ఈ పాట్లు? అందుకే 2023 నవంబర్‌ 18, 19 తేదీలలో రోడ్లపైకి రండి.” అని పవన్‌ పేర్కొన్నారు.