Pawan Kalyan: ఒక్క కులం వల్ల అధికారం రాదు.. పవన్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: కులాల గురించి ఆలోచిస్తే ఎప్పటికీ అభివృద్ధి సాధించలేమని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వెల్లడించారు. వారాహి యాత్రలో భాగంగా మచిలీపట్నంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. మచిలీపట్నానికి చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. అవనిగడ్డ, మచిలీపట్నం ,పెడన, కైకలూరు కలిపితే అద్బుతమైన ప్రాంతం అవుతుందన్నారు. జాతీయ జెండా రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య ఆకలితో చనిపోయారంటే కడుపు తరుక్కుపోయిందన్నారు.
ఒక్క కులం వల్ల అధికారం రాదన్నారు జనసేన అధినేత పవన్. నేను కాపు కులంలో పుట్టానని, అలా అని కేవలం కాపు ఓట్ బ్యాంక్ తీసుకుంటే ఎక్కడ ఎదుగుతామన్న పవన్.. అలా ఆలోచిస్తే కులనాయకుల్లా మిగిలిపోతామన్నారు. ఒక కులానికి అంటగట్టి నన్ను ఎందుకు కులనాయకుడ్ని చేస్తారని ప్రశ్నించారు.రాజమండ్రిలో మాట్లాడుతూ కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించమన్నాను.. ఏపీలో కాపులు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టే అలా అన్నానని పవన్ తెలిపారు. జనసేన సాధారణ ప్రాంతీయ పార్టీ కాదని.. దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకొని ఆవిర్బవించిన పార్టీ అని ఆయన తెలిపారు. మున్ముందు జనసేన భావజాలమే దేశమంతా వ్యాపిస్తుందని పవన్ వెల్లడించారు. రాజధానికి 30 వేల ఎకరాలు అన్నప్పుడు ఆరోజు విభేదించానని ఆయన చెప్పుకొచ్చారు. రాజధాని అనేది రాత్రికి రాత్రే అభివృద్ధి కాదన్నారు. జగన్‌ను చిన్నప్పటి నుంచీ చూస్తున్నానని, రాష్ట్రానికి జగన్ సరైన వ్యక్తి కాదని ఆనాడే అనుకున్నానని పవన్ వెల్లడించారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Also Read: TDP Deeksha: దీక్ష విరమించిన టీడీపీ నేతలు.. లోకేష్, భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు
జనసేన పార్టీ నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “బీఎస్పీ నుంచి 20 ఏళ్లు కష్టపడితే మాయావతి సీఎం అయ్యారు. పార్టీ పెట్టగానే ముఖ్యమంత్రి అయిపోవాలని లేడీకి లేచిందే పరుగులా ఆలోచించను. ఎన్టీఆర్‌కు మాత్రమే అలా సాధ్యమైంది. రాజధాని ఎక్కడ అంటే మూడు చోట్ల అని చెప్పుకోవాలా..?. తెలుగుదేశాన్ని పాలసీ పరంగానే విభేదించాను. ముప్పైవేల ఎకరాల గురించి విభేదించాను. వైసీపీ మీద వ్యక్తిగతం ద్వేషంలేదు. చిన్నప్పటి నుండి జగన్‌ని చూస్తున్నాను.. టీనేజ్‌లో ఎస్సైని కొట్డిన ఘటన చూశాను.. జగన్ రాష్ట్రానికి సరికాదని మద్దతు ఇవ్వలేదు. బ్రాహ్మణులను ద్వేషించని పార్టీ బీఎస్పీ, వాళ్లతోనే జత కలిసి సీఎం అయింది మాయావతి. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ భారత రాష్ట్ర సమితి అయిపోయింది. సనాతన ధర్మం బలంగా నమ్ముతాను, సర్వమతాలను ఆదరించే నేల అదే సనాతన ధర్మం.స్థానిక ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి పనిచేస్తుంటే ఏం జరుగుతుందో అర్దమయ్యేది కాదు.” అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!