Pawan Kalyan: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్‌ అంశంలో రాష్ట్రపతి ప్రకటనపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆర్టికల్‌ 370 రద్దుపై కేంద్రం వాదనలను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఆర్టికల్‌ 370 అనేది తాత్కాలిక నిబంధన మాత్రమే అని, శాశ్వతం కాదని స్పష్టం చేసిన విషయం విదితమే. ఈ చారిత్రాత్మక తీర్పుపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా స్పందించారు. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జమ్ము – కశ్మీర్‌ను భారతదేశంలో సంపూర్ణంగా విలీనం చేయాలని కలలుగన్న భారత్ ప్రజలందరికీ.. సుప్రీం తీర్పు మరో విజయమని ఆయన వ్యాఖ్యానించారు. దేశ ప్రజలందరూ సంతోషంగా వేడుకలు జరుపుకొనే మధుర క్షణాలు అంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

Read Also: Deputy CM: కేసీఆర్ ను పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

×
×
Ad

భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేస్తూ చేసిన నిర్ణయాన్ని సుప్రీం కోర్టు ఏకగ్రీవంగా సమర్థిస్తూ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామనన్నారు. సుప్రీం తీర్పు ద్వారా ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగపరంగా చెల్లుబాటేనని ధృవీకరించిందని పవన్‌ కళ్యాణ్ వెల్లడించారు. ఈ నిర్ణయం దేశ సమగ్ర ఐక్యత, పురోగతికి ఒక ముఖ్యమైన పరిణామమని ఆయన చెప్పుకొచ్చారు. అతి పెద్ద లౌకిక దేశమైన భారత్ సాధించిన విజయమని పవన్‌ స్పష్టం చేశారు.