NTV Telugu Site icon

Pawan Kalyan: రాజోలు, రాజనగరంలో జనసేన పోటీ చేస్తుంది: పవన్ కళ్యాణ్

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan Says Janasena Will contest from Razole and Rajanagaram: ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం రెండు స్థానాలను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. రాజోలు, రాజనగరంలో జనసేన పోటీ చేస్తుందని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించడాన్ని జనసేనాని తప్పుబట్టారు. టీడీపీ అభ్యర్తుల ప్రకటనపై బాబు పొత్తు ధర్మం పాటించలేదని పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే పొత్తుల్లో ఒక మాట అటూ ఇటూ ఉంటుందని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. మండపేట, అరకు అభ్యర్థులను టీడీపీ ప్రకటించిన విషయం తెలిసిందే.

శుక్రవారం జనసేన కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం పవన్‌ కల్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ… ‘టీడీపీ 2 సీట్లు ప్రకటించింది. ఇది పొత్తు ధర్మం కాదు. పొత్తులో ఉన్నప్పుడు ధర్మం పాటించాలి. కానీ టీడీపీ అది విస్మరించి.. ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించింది. కాబట్టి మేము రెండు సీట్లు ప్రకటిస్తున్నాం. రాజోలు, రాజనగరంలో జనసేన పోటీ చేస్తుంది. ప్రత్యేక పరిస్థితుల్లోనే మేమూ రెండు సీట్లు ప్రకటిస్తున్నాం’ అని అన్నారు.

Also Read: AP Governor: విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు చేశాం: అబ్దుల్ నజీర్‌

‘టీడీపీ అభ్యర్థుల ప్రకటన జనసేనలో ఆందోళన చెలరేగింది. దీనిపై నన్ను అడిగిన పార్టీ నేతలకు నా క్షమాపణలు. పొత్తుల్లో ఒక మాట అటున్నా.. ఇటున్నా కలిసే వెళ్తున్నాం. రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తున్నాం. ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుంది. ఎన్నికల్లో మూడో వంతు సీట్లు సాధిస్తాం. పొత్తులపై కొందరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నారా లోకేష్‌ మా నాన్నే సీఎం అవుతారని మాట్లాడినా మౌనంగా ఉన్నా. ఎందుకంటే జగన్ నడిపే ఈ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించాలని. ప్రజలకు మేలు జరగాలని నేను కోరుకుంటున్నా’ అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

Show comments