Pawan Kalyan: రాజోలు, రాజనగరంలో జనసేన పోటీ చేస్తుంది: పవన్ కళ్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Says Janasena Will contest from Razole and Rajanagaram: ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం రెండు స్థానాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాజోలు, రాజనగరంలో జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించడాన్ని జనసేనాని తప్పుబట్టారు. టీడీపీ అభ్యర్తుల ప్రకటనపై బాబు పొత్తు ధర్మం పాటించలేదని పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే పొత్తుల్లో ఒక మాట అటూ ఇటూ ఉంటుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మండపేట, అరకు అభ్యర్థులను టీడీపీ ప్రకటించిన విషయం తెలిసిందే.
శుక్రవారం జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ… ‘టీడీపీ 2 సీట్లు ప్రకటించింది. ఇది పొత్తు ధర్మం కాదు. పొత్తులో ఉన్నప్పుడు ధర్మం పాటించాలి. కానీ టీడీపీ అది విస్మరించి.. ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించింది. కాబట్టి మేము రెండు సీట్లు ప్రకటిస్తున్నాం. రాజోలు, రాజనగరంలో జనసేన పోటీ చేస్తుంది. ప్రత్యేక పరిస్థితుల్లోనే మేమూ రెండు సీట్లు ప్రకటిస్తున్నాం’ అని అన్నారు.
Also Read
- Trump-Netanyahu: ట్రంప్‌నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
Also Read: AP Governor: విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు చేశాం: అబ్దుల్ నజీర్
‘టీడీపీ అభ్యర్థుల ప్రకటన జనసేనలో ఆందోళన చెలరేగింది. దీనిపై నన్ను అడిగిన పార్టీ నేతలకు నా క్షమాపణలు. పొత్తుల్లో ఒక మాట అటున్నా.. ఇటున్నా కలిసే వెళ్తున్నాం. రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తున్నాం. ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుంది. ఎన్నికల్లో మూడో వంతు సీట్లు సాధిస్తాం. పొత్తులపై కొందరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నారా లోకేష్ మా నాన్నే సీఎం అవుతారని మాట్లాడినా మౌనంగా ఉన్నా. ఎందుకంటే జగన్ నడిపే ఈ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించాలని. ప్రజలకు మేలు జరగాలని నేను కోరుకుంటున్నా’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.
తాజావార్తలు
-
Trump-Netanyahu: ట్రంప్‌నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
-
Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!