Janasena Formation Day: రేపే జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. గిరిజన పల్లెలో పవన్ కళ్యాణ్ వేడుకలు.. షెడ్యూల్ ఇదే!
- పాడేరు నియోజకవర్గం, నందిగరువు గ్రామంలో పవన్ పర్యటన
- ప్రధానమంత్రి జన్ మన్ (అడవితల్లి బాట) ద్వారా నిర్మించిన రోడ్ల పరిశీలన
- నిర్మాణం పూర్తయిన రహదారుల ప్రారంభోత్సవం
- ప్రజలతో మాటా-మంతి
- గిరిపుత్రులతో కలసి మధ్యాహ్న భోజనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena Formation Day: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం (మార్చి 14) వేడుకలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ శ్రేణులు వేడుకలకు సిద్ధమయ్యారు. అయితే, ఈ ఏడాది పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని గిరిపుత్రుల మధ్య జరుపుకోవాలని పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. రేపు (శనివారం) అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలోని నందిగరువు గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొంటారు. గిరిజనుల కష్టసుఖాలను తెలుసుకుంటూనే, వారి మధ్యే పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నారు.
READ ALSO: Iran War: ఇరాన్ ‘‘లొంగిపోబోతోంది’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ దూకుడు..
- Rain Alert: మళ్లీ వర్షాల జోరు.. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగులతో భారీ వర్షాలు!
- Andhra Paper Mill Fine: ఆంధ్రా పేపర్ మిల్లుకు రూ.21 కోట్ల జరిమానా!
- Madanapalle Lady Don: మదనపల్లె ‘లేడీ డాన్’ ఇంట్లో పోలీసుల మెరుపు దాడులు.. 50 రకాల ఆస్తి, 15 ఫోర్జరీ పత్రాలు స్వాధీనం!
పవన్ కళ్యాణ్ పర్యటన విశేషాలు..
తొలుత ఓనూరు జంక్షన్ వద్ద జనసేన జెండాను పవన్ కళ్యాణ్ ఆవిష్కరిస్తారు. అనంతరం ‘పీఎం జన్ మన్’ (ప్రధాన మంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్) పథకం కింద నిర్మించిన రోడ్లను ఆయన స్వయంగా పరిశీలిస్తారు. ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు వరకు నిర్మించిన 2.4 కి.మీ రహదారిని కాలి నడకన ప్రయాణిస్తూ పనుల నాణ్యతను తనిఖీ చేస్తారు. తర్వాత నిర్మాణం పూర్తయిన రహదారులను గిరిజనుల సమక్షంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత నందిగరువు గ్రామ ప్రజలతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అవుతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకునేందుకు ‘మాటా-మంతి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పర్యటన చివరలో గిరిజనులతో కలిసి పవన్ కళ్యాణ్ మధ్యాహ్న భోజనం చేస్తారు. అధ్యక్షుడి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో జనసైనికులు సేవా కార్యక్రమాలను చేపట్టనున్నారు. ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే పార్టీ ప్రధాన లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ దూకుడు..
-
Tilak vs Vaibhav: ఏంటిది వైస్ కెప్టెన్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన తిలక్ వర్మ.. వీడియో వైరల్!
-
Mahatma Gandhi: గాంధీగా మారిన మనోజ్ బాజ్‌పేయి.. ఆ 21 రోజుల కథతో వస్తున్న కొత్త సినిమా!
-
Rain Alert: మళ్లీ వర్షాల జోరు.. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగులతో భారీ వర్షాలు!
-
Shruti Haasan: AI ఫేక్ వీడియోలపై కోర్టు సీరియస్.. శృతి హాసన్‌కు భారీ ఊరట!
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!