Jananayakudu: సంక్రాంతి కానుకగా దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ‘జన నాయకుడు’ జనవరి 9న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్‌కు సిద్ధం అవుతుంది. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ హీరో విజయ్ నటిస్తున్న లాస్ట్ మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా తమిళ వెర్షన్‌కు సంబంధించి వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటి వరకూ ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.15 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల అంచనా.
READ ALSO: AP Deputy CM Pawan: రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్.. 96 గదుల నిర్మాణానికి శంకుస్థాపన
ఎప్పటి నుంచో ‘జన నాయకుడు’ సినిమా విషయంలో ఒక ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది తెలుగులో విజయవంతమైన ‘భగవంత్ కేసరి’ కి రీమేక్‌గా అని జోరుగా ప్రచారం ఉంది. నిజానికి ఇప్పటికి ‘జన నాయకుడు’ మేకర్స్ ఈ ప్రచారంపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే తాజాగా సినిమా డైరెక్టర్ హెచ్.వినోద్ ఈ ప్రచారంపై స్పందించారు. ‘నేను ఈ విషయాన్ని కన్ఫార్మమ్ చేయను. అలాగే కొట్టిపారేయను. మీకు ఇంతకు ముందు కూడా ఈ విషయం చెప్పాను. ఇది దళపతి సినిమా. ఇది రీమేకా..? లేదంటే ఏదైనా చిత్రం నుంచి స్ఫూర్తిపొంది తీశారా? అన్న విషయంపై ప్రేక్షకులు ఆందోళనపడాల్సిన అవసరం లేదు. వచ్చి సినిమా చూడండి’ అని చెప్పుకొచ్చారు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ జనవరి 3న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అఫిషియల్‌గా ప్రకటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఎప్పటి నుంచో ‘జన నాయకుడు’ రిమేక్ అని జరుగుతున్న ప్రచారానికి రేపు రిలీజ్ కాబోతున్న సినిమా ట్రైలర్ చూస్తే క్లారిటీ వస్తుందని సినిమా విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Pawan Kalyan: ఎవరో వస్తారనుకుంటే సూరి వచ్చాడు..టెన్షన్లో పవన్ ఫ్యాన్స్!